MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు

Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు

అల్లరి నరేష్ తాను నటించిన ఓ సినిమా వల్ల మూడు నెలలు డిప్రెషన్ కి గురయ్యాడట. చివరికి నితిన్ చెప్పిన మాటలు తనని మార్చాయని అల్లరి నరేష్ తెలిపారు. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 03 2026, 08:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nithiin
Image Credit : Asianet News

Nithiin

ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ హీరోగా వరుస సినిమాలతో విజయాలు అందుకునేవాడు. ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టం అనుకుంటున్న రోజుల్లో అల్లరి నరేష్ ఏకంగా ఏడెనిమిది సినిమాలు చేశాడు. ఆ తర్వాత అల్లరి నరేష్ కెరీర్ కి చిన్న బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వరుస చిత్రాలతో నరేష్ జోరు పెంచాడు. లెజెండ్రీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా అల్లరి నరేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయినప్పటికీ అల్లరి నరేష్ కి కూడా ఇబ్బందులు, ఫెయిల్యూర్స్ తప్పలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రంభ ఊర్వశి మేనక రిలీజ్ కి రెడీ
Image Credit : X/@HasyaMovies

రంభ ఊర్వశి మేనక రిలీజ్ కి రెడీ

సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ నటించిన రంభ ఊర్వశి మేనక చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో అల్లరి హీరో మరో హిట్ కొట్టడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్ట్రగుల్స్ గురించి అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నమ్మి, ఎంతో కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అయినప్పుడు డిప్రెషన్ కి గురయ్యానని అల్లరి నరేష్ తెలిపారు.

35
ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నా
Image Credit : Asianet News

ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నా

ఆ సినిమా మరేదో కాదు.. అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రలో నటించిన 'నేను'. 2004లో విడుదలైన నేను చిత్రంలో అల్లరి నరేష్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. నేను చాలా ఆశలు పెట్టుకున్నా. షూటింగ్ లో 32 సార్లు నాకు గాయాలు అయ్యాయి. యాక్షన్ సీన్లు, జంపింగ్ లు అన్నీ డూప్ లేకుండానే చేశా. అంత కష్టపడ్డప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు.

45
మూడు నెలలు బెడ్ రూమ్ లోనే, పనిమనిషి తెస్తేనే భోజనం
Image Credit : our own

మూడు నెలలు బెడ్ రూమ్ లోనే, పనిమనిషి తెస్తేనే భోజనం

అది నా 9వ చిత్రం. దీనితో హిట్, ఫ్లాప్ ని హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ నాకు అప్పటికి లేదు. నేను మూవీ ఫ్లాప్ అని తెలియగానే చాలా డిప్రెస్డ్ గా అనిపించింది. 3 నెలలు బెడ్ రూమ్ కి మాత్రమే పరిమితమయ్యా. భోజనం కూడా బెడ్ రూమ్ కి పనిమనిషి తెస్తేనే తినేవాడిని లేకుంటే లేదు. ప్రతి సినిమాకి రిలీజ్ టైంలో విపరీతంగా టెన్షన్ పడేవాడిని.

55
నితిన్ మాటలతో మార్పు
Image Credit : Asianet News

నితిన్ మాటలతో మార్పు

సుడిగాడు మూవీ వరకు కూడా ఆ టెన్షన్ అలాగే ఉండేది . సుడిగాడు కోసం కూడా చాలా కష్టపడ్డా. రిలీజ్ ముందు రోజు వరకు కూడా మార్పులు చేస్తూనే ఉన్నాం. ఎలాగైనా ఈ సినిమా హిట్ కావాలని కోరుకున్నా. ప్రీ వ్యూ షో వేసినప్పుడు అందరి నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమా ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయా. ఎవ్వరి ఫోన్ లు ఎత్తలేదు. టెన్షన్ పడుతూనే ఉన్నా. నితిన్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ప్రీవ్యూ లో చెప్పినది నమ్మొద్దు. ఈ సినిమా కచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడు అని చెప్పాడు. రిలీజ్ రోజు ఫస్ట్ షో పడగానే 300 మిస్ కాల్స్ ఉన్నాయి. ప్రీవ్యూ లో నెగిటివ్ గా చెప్పిన వాళ్లే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అదిరిపోయింది అని చెప్పారు. సినిమా హిట్ అయింది. ఇక ఏ సినిమాకి కూడా రిలీజ్ రోజు టెన్షన్ పడకూడదు.. ఎలాంటి రిజల్ట్ వచ్చినా ఒకేలా తీసుకోవాలి. కష్టపడడం మాత్రమే నా చేతుల్లో ఉంది అని అప్పటి నుంచి తాను మారినట్లు నరేష్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Recommended image2
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Recommended image3
Yash: సంచలనం సృష్టిస్తున్న సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ సపోర్ట్.. ఫొటోలు చూసేయండి!
Related Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved