MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Romanchakam Day 2 Collections: రోమాంచకం మూవీకి అదిరిపోయే కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంత వచ్చాయంటే?

Romanchakam Day 2 Collections: రోమాంచకం మూవీకి అదిరిపోయే కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంత వచ్చాయంటే?

సందీప్‌ రెడ్డి వంగా వంగా నిర్మించిన చిన్న సినిమా `రోమాంచకం`. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక శనిల్‌ కుమార్‌ జంటగా నటించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 05 2026, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న రోమాంచకం మూవీ
Image Credit : Asianet News

పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న రోమాంచకం మూవీ

సుమంత్‌ ప్రభాస్‌ కంటెంట్‌ బేస్డ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన `రోమాంచకం` మూవీలో నటించాడు. అనంతిక శనిల్‌ కుమార్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి వేణుగోపాల్‌ రెడ్డి దర్శకుడు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించారు. సందీప్‌ రెడ్డి వంగా దీనికి సమర్పకులు. గురువారం ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. లవ్‌ అండ్‌ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ, డైలాగ్‌ కామెడీని నమ్ముకొని రూపొందించారు. కానీ ఆ విషయంలో మిశ్రమ స్పందన లభించింది. కొన్ని చోట్ల ఫన్‌ వర్కౌట్‌ అయ్యింది. కానీ మరికొన్ని చోట్ల మాత్రం ఓవర్‌లాప్‌ అయ్యింది. గోల ఎక్కువ కావడంతో కామెడీ పక్కకెళ్లిన ఫీలింగ్‌ కలిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోమాంచకం మూవీ కలెక్షన్లు
Image Credit : X/@VangaPictures

రోమాంచకం మూవీ కలెక్షన్లు

ఇక `రోమాంచకం` మూవీ బాక్సాఫీసు వద్ద ఎంత వరకు సత్తా చాటుతుందనేది చూస్తే, ఇది మొదటి రోజు రూ.1.75కోట్లు వసూలు చేసింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ఈ కలెక్షన్లు. ఇందులో ఇండియాలోనే ఈ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇక రెండో రోజు రూ.1.47 కోట్లని వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఈ మూవీకి రెండు రోజుల్లో రూ.3.22కోట్లు రావడం విశేషం. సుమంత్‌ ప్రభాస్‌కి ఇది మంచి వసూళ్లుగానే చెప్పొచ్చు.

34
రోమాంచకం బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

రోమాంచకం బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఈ మూవీకి ప్రభాస్‌, విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ చేశారు. సందీప్‌ రెడ్డి వంగా బ్రాండ్‌ కూడా ఉంది. ఇవన్నీ కలిసి వచ్చాయి. మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. అయితే, శనివారం, ఆదివారం వచ్చే కలెక్షన్లని బట్టి ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకి పది కోట్ల వరకు బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. ఐదు కోట్ల బిజినెస్‌గా లెక్కకట్టారు. అంటే పది కోట్ల గ్రాస్‌ రావాలి. శనివారం, ఆదివారం పుంజుకుంటే ఈ మూవీ రెండో వారంలోనే బ్రేక్‌ ఈవెన్‌ వరకు చేరుకునే ఛాన్స్ ఉంది. మరి ఆ స్థాయిలో సత్తా చాటుతుందా? సుమంత్‌ ప్రభాస్‌ గట్టెక్కుతాడా అనేది చూడాలి.

44
రోమాంచకం మూవీ కథ
Image Credit : Asianet News

రోమాంచకం మూవీ కథ

`రోమాంచకం` కథేంటనేది చూస్తే. ఇందులో హీరో డేటింగ్‌ యాప్ట్ పెట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో చెన్నై అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ అమ్మాయి చెన్నై నుంచి హైదరాబాద్‌కి హీరో వద్దకు వస్తుంది. కానీ అతడి రియాక్షన్‌ చూస్తే వచ్చిన కాసేపటికే ఎవరికీ చెప్పకుండా ఏటో వెళ్లిపోతుంది. ఆ అమ్మాయిని వెతకడమే ఈ మూవీ, వెతికాక ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. పోలీస్‌ స్టేషన్‌ వెళ్తారు. ఆ తర్వాత వాళ్ల పేరెంట్స్ వచ్చి హీరోయిన్‌ని తీసుకెళ్లిపోతారు. అయితే ఆమె పెళ్లి జరుగుతుందని తెలిసి వాళ్ల ఇంటికి వెళ్తాడు హీరో. కానీ అక్కడ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది సినిమా. ఫ్రెండ్స్ మధ్య గొడవలు, వాదనలు, డైలాగ్స్ ఫన్నీగా ఉంటాయి. కాకపోతే అవి ఓవర్‌ గా ఉంటాయి. చాలా చోట్ల కామెడీ బాగానే వర్కౌట్‌ అయ్యింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
సందీప్ రెడ్డి వంగా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Ramba Oorvasi Menaka Day 1 Collections: రంభ ఊర్వశి మేనక ఫస్ట్ డే కలెక్షన్లు.. అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved