MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Ishtakameshwari Temple: గుండె ధైర్యం ఉంటేనే ఇక్కడికి వెళ్లగలరు.. నల్లమల అడవుల్లో మనిషిలా మారే విగ్రహ ఆలయం !

Ishtakameshwari Temple: గుండె ధైర్యం ఉంటేనే ఇక్కడికి వెళ్లగలరు.. నల్లమల అడవుల్లో మనిషిలా మారే విగ్రహ ఆలయం !

Ishtakameshwari Temple Srisailam : శ్రీశైలం నల్లమల అడవుల్లో దాగిన అద్భుతమైన ఆలయం ఇష్టకామేశ్వరీ దేవి టెంపుల్. అమ్మవారి నుదుటిపై కుంకుమ పెడితే మనిషి చర్మంలా మెత్తగా తగులుతుంది. ఈ ఆలయం గురించిన కంప్లీట్ డీటైల్స్ మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 02 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
41 రోజుల్లో కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి.. శ్రీశైలంలో ఈ రహస్య ఆలయం గురించి మీకు తెలుసా?
Image Credit : Gemini

41 రోజుల్లో కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి.. శ్రీశైలంలో ఈ రహస్య ఆలయం గురించి మీకు తెలుసా?

ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన శ్రీశైలం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య దర్శనం. కానీ, ఈ పుణ్యక్షేత్రంలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన, ఎంతో మహిమాన్వితమైన మరొక అద్భుత ప్రదేశం ఉంది. అదే దట్టమైన నల్లమల అడవుల మధ్య కొలువైన ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. భారతదేశం మొత్తం మీద ‘ఇష్టకామేశ్వరి’ పేరుతో దేవి ఆలయం ఉన్న ఏకైక ప్రదేశం శ్రీశైలం మాత్రమే. సాధారణంగా కామేశ్వరీ దేవి అంటే ఎనిమిది భుజాలతో కనిపిస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో ప్రత్యేక స్వరూపంలో దర్శనమిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మనిషి చర్మంలా మెత్తగా తాకే అమ్మవారి నుదురు
Image Credit : Gemini

మనిషి చర్మంలా మెత్తగా తాకే అమ్మవారి నుదురు

ఇష్టకామేశ్వరి దేవి ఆలయంలో జరిగే అద్భుతం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ విగ్రహం రాతితో మలచబడినప్పటికీ, భక్తులు అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టే సమయంలో ఆమె నుదుటి భాగం మనిషి చర్మంలా ఎంతో మెత్తగా తగులుతుంది. విగ్రహాన్ని తాకిన ప్రతిఒక్కరూ ఈ అనుభూతిని పొంది ఒళ్లు జలదరింపజేసే అద్భుతాన్ని కళ్లారా చూస్తారు. రాయిలా ఉండే విగ్రహం నుదుటి వద్ద మాత్రం మనుషుల చర్మంలా మెత్తగా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని చూడటానికి ఎంతోమంది భక్తులు సాహసాలు చేసి మరి ఇక్కడికి వస్తుంటారు.

35
కోరిన కోరికలు 41 రోజుల్లో తీర్చే కొంగుబంగారం
Image Credit : Instagram/sairam_chowdary_gadde

కోరిన కోరికలు 41 రోజుల్లో తీర్చే కొంగుబంగారం

తన వద్దకు వచ్చే భక్తులు మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా, ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు వెంటనే నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి నుదుటన బొట్టు పెట్టి, మనసులోని కష్టాన్ని చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ సమస్య తీరిపోతుందని ప్రతీతి. పూర్వం ఈ ప్రదేశం కాపాలికులు, సిద్ధులకు ప్రధాన ధ్యాన కేంద్రంగా ఉండేది. నాగార్జునుడు వంటి సిద్ధులు ఇక్కడి మూలికలతో ఎన్నో ప్రయోగాలు చేశారని కథనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడి గుహలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

45
జీప్ రోలర్‌కోస్టర్ రైడ్.. ఒళ్లు గగుర్పొడిచే సాహస ప్రయాణం
Image Credit : our own

జీప్ రోలర్‌కోస్టర్ రైడ్.. ఒళ్లు గగుర్పొడిచే సాహస ప్రయాణం

శ్రీశైలం ప్రధాన ఆలయం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహాలయానికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడికి సాధారణ కార్లు లేదా బైక్‌లు వెళ్లలేవు. శ్రీశైలం నుండి ప్రత్యేకంగా నడిచే ఫారెస్ట్ జీపుల ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. డోర్నాల మార్గంలో 12 కిలోమీటర్లు వెళ్లాక దట్టమైన అడవిలోకి జీపులు ప్రవేశిస్తాయి. పెద్ద పెద్ద బండరాళ్లు, గుంతల మధ్య జీపు సాగించే 40 నిమిషాల ప్రయాణం ఒక అడ్వెంచరస్ రైడ్‌లా ఉంటుంది. అడవిలో క్రూరమృగాల సంచారం ఎక్కువ కాబట్టి సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరినీ అడవిలోకి అనుమతించరు.

55
చెంచులే అర్చకులుగా ఉన్న ప్రాచీన గుహాలయం
Image Credit : Instagram/actor_nithiin

చెంచులే అర్చకులుగా ఉన్న ప్రాచీన గుహాలయం

చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం 8వ లేదా 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. చాలా కాలం క్రితం అడవిలోని చెంచులకు ఈ దేవి విగ్రహం లభించిందని, నాటి నుండి నేటి వరకు చెంచు తెగకు చెందిన వారే ఇక్కడ అర్చకులుగా పూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతారు. ఇక్కడి గుహ చాలా చిన్నదిగా ఉంటుంది, కేవలం నలుగురు మాత్రమే లోపల కూర్చోగలరు. ప్రకృతి ఒడిలో, కిలకిలరావాలు చేసే పక్షుల చప్పుడు మధ్య వెలిసిన ఈ ఇష్టకామేశ్వరి దేవిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు భావిస్తారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ దేశానికి వెళితే భారతీయులకు ఫుడ్ ఫ్రీ.. అక్కడ మనవాళ్లకు రాచమర్యాదలు
Recommended image2
అత్యధిక పాలు ఇచ్చే ఆవు ఏది? రోజుకు ఎన్ని లీటర్లు ఇస్తుందో తెలుసా?
Recommended image3
USA: అమెరికాలో అపార్ట్‌మెంట్లు ఉండవా.? అసలు అక్క‌డ రెంట్స్ ఎలా ఉంటాయో తెలుసా.?
Related Stories
Recommended image1
Dangerous Island: ఇక్కడికి వెళ్తే శవం కూడా దొరకదు! భారత్‌లోని అత్యంత భయంకరమైన ఐలాండ్ రహస్యాలివే !
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved