MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..

Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..

Hello Brother Review: అక్కినేని హీరో నాగార్జున నటించిన అద్భుతమైన సినిమాల్లో హలో బ్రదర్ ఒకటి. అక్కినేని నాగేశ్వరావుతో పాటు ఇండస్ట్రీలో చాలామంది వద్దు అన్నా సరే నాగార్జున ఏ దైర్యంతో ఈసినిమా చేశారు? చిరంజీవి ఈమూవీని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి?

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
90s లో వచ్చిన అద్బుతమైన సినిమా..
Image Credit : jio Hotstar

90s లో వచ్చిన అద్బుతమైన సినిమా..

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్‌తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హలో బ్రదర్ కథ విషయానికి వస్తే..
Image Credit : Asianet News

హలో బ్రదర్ కథ విషయానికి వస్తే..

మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు.

ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్‌గా ఇండియాకు తిరిగివస్తాడు.

దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్‌గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది? వీరిద్దరూ తమ అసలు గుర్తింపును ఎలా తెలుసుకున్నారు? మిశ్రో(చరణ్ రాజ్) పగ నుంచి కుటుంబాని ఎలా కాపాడుకున్నారు? అనేదే మిగతా కథ. ఈ సినిమా కథలో మధ్య మధ్యలో కోటా శ్రీనివాసరావు, మల్లికార్జునరావుతో పాటు బ్రహ్మానందం కామెడీ సీన్లు కడుపు నొప్పి పుట్టించేవిధంగా నవ్విస్తాయి.

36
నటీనటుల ప్రదర్శన (Performances)
Image Credit : Asianet News

నటీనటుల ప్రదర్శన (Performances)

ఈ సినిమాలో నాగార్జున నటన ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయి. 'దేవా'గా మాస్ డైలాగ్ డెలివరీ, నడక, డాన్సులు, ఫైట్లలో ఈలలు వేయించారు. ఇక 'రవి వర్మ'గా సాఫ్ట్ అండ్ జెంటిల్‌మన్ క్యారెక్టర్‌లో మెప్పించారు. రెండు పాత్రల మధ్య వ్యత్యాసాన్ని బాడీ లాంగ్వేజ్‌తో చాలా స్పష్టంగా చూపించారు. కింగ్ చూపించిన వేరియేషన్స్ కు అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ముఖ్యంగా మాస్ పాత్రలో సుర్రు సుమ్మైపోద్ది అంటూ నాగ్ చెప్పిన డైలాగ్స్ గట్టిగా పేలాయి.

రమ్యకృష్ణ విషయానికి వస్తే.. గ్లామర్ డోస్ పెంచి దేవా కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాల్లో జీవించింది రమ్యకృష్ణ. నాగార్జునతో ఆమె కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇద్దరు పోటీ పడి మాస్ పాత్రను పండించారు. ముఖ్యంగా పాటల్లో వారి డాన్స్ మూమెంట్స్ థియేటర్లలో విపరీతమైన రచ్చ చేశాయి. ఇక సౌందర్య గురించి ప్రత్చేకంగా చెప్పాల్సింది ఏముంటుంది... రవి వర్మ సరసన హోమ్లీ అండ్ క్లాసీ లుక్‌తో ఆకట్టుకున్నారు. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వీరితో పాటు బ్రహ్మానందం, ఆలీ , కోటా, మల్లికార్జున రావు, సుత్తివేలు, గిరిబాబు, బాబు మోహన్ కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన బలం. విలన్ గా చరణ్ రాజ్.. క్రూరమైన పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇక అలనాటి సీనియర్ నటుడు రాజనాలకు ఇది చివరి సినిమాకాగా.. ఇతర నటీనటులు తమ పాత్ర పరిది మేరకు అలరించారు.

46
సాంకేతిక విశ్లేషణ (Technical Aspects)
Image Credit : Hello Brother

సాంకేతిక విశ్లేషణ (Technical Aspects)

కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో ఈవీవీ సిద్ధహస్తుడు. ద్విపాత్రాభినయం, అందులోనూ రిఫ్లెక్స్ యాక్షన్ అనే విచిత్రమైన పాయింట్‌ను స్క్రీన్‌ప్లేలో ఎక్కడా కన్‌ఫ్యూజన్ లేకుండా లాజిక్‌ను పక్కనబెట్టి కేవలం కామెడీ, ఎమోషనల్ పాయింట్ మీదనే సినిమాను నడిపించారు. అప్పటివరకు రాజేంద్ర ప్రసాద్ తో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన ఈవివికి.. మొదటి అవకాశం ఇచ్చిన స్టార్ హీరో నాగార్జున. ఆయనతో సినిమా చేసేప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.

‘హలో బ్రదర్’ సినిమాకు ప్రాణం పోసిన అంశాలలో మ్యూజిక్ కూడా ఉంది. ఈ సినిమా ఆల్బమ్ నాటి యూత్‌ను ఊపేసింది. "ప్రియరాగాలే", "కన్నెపిట్టరో కన్ను కొట్టరో", "అబ్బా ఏందెబ్బా", "క్కండయ్యా బాబు వచ్ఛిందయ్యా బండి ", "మనసిచ్చీ ఇచ్చీ బరువాయే" – ఇలా ప్రతి పాట ఒక చార్ట్‌బస్టరే. దీనితో పాటు వర్మన్ సినిమాటోగ్రఫీ ఆ కాలానికి తగినట్లుగా చాలా బ్రైట్‌గా ఉంటుంది. ఎడిటర్ రవీంద్రబాబు ఇద్దరు నాగార్జునలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ద్విపాత్రాభినయం (Split screen / Croma) సీన్లను చాలా చక్కగా కుదిర్చారు.

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ..

కేవలం ₹2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, అప్పట్లో దాదాపు ₹11.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 1994లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అంతే కాదు ఈ సినిమాకు గాను నాగార్జునకు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డు దక్కింది. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజ్-కోటి, బెస్ట్ ఎడిటర్‌గా రవీంద్రబాబు నంది అవార్డులు అందుకున్నారు

56
నాగేశ్వరరావు వద్దని చెప్పినా.. నాగార్జున వినలేదు..
Image Credit : Asianet News

నాగేశ్వరరావు వద్దని చెప్పినా.. నాగార్జున వినలేదు..

నాగార్జున డూప్ గా స్టార్ హీరో..

హలో బ్రదర్ సినిమా1992లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'ట్విన్ డ్రాగన్స్' (జాకీచాన్ నటించిన చిత్రం) ఆధారంగా తెరకెక్కింది.

హలో బ్రదర్ సినిమా చేయొద్దని ఇండస్ట్రీలో చాలా మంది నాగార్జునకి ఫోన్ చేసి చెప్పారట. ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టామని ఏఎన్నార్ కూడా గట్టిగా చెప్పారట. కానీ నాగార్జునలో ఏదో తెలీని కాన్ఫిడెన్స్ అలా ముందుకు నడిపించింది.

రమ్యకృష్ణ పోషించిన 'మంగతాయారు' పాత్ర కోసం మొదట నటి రంభను అనుకున్నారు. డేట్స్ కుదరకపోవడంతో ఆమె తప్పుకోగా, రమ్యకృష్ణ ఆ పాత్రను అద్భుతంగా పండించింది. అయితే రంభ "కన్నెపెట్టరో" పాటలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది.

నాగార్జునకి డూప్ గా శ్రీకాంత్ నటించారు. ఇవివి గారికి ప్రియమైన శిష్యుడు శ్రీకాంత్. కాబట్టి డూప్ గా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడు.

చిరంజీవి మిస్ అయ్యాడు.. నాగార్జున హిట్ కొట్టాడు..

హలో బ్రదర్ సినిమా కథను ఈవీవీ సత్యనారాయణ నాగార్జున కోసం రాసుకోలేదు.. ఈ కథను ముందుగా చిరంజీవి కోసం తయారు చేసుకొని ఆయనకు వినిపించారట. కానీ, అప్పటికే డ్యుయల్‌ రోల్‌ సినిమాలు చేసి ఉండటంతో ఈవీవీ కథను చిరంజీవి తిరస్కరించాడు. దీంతో ఈ కథ నాగార్జున దగ్గరకు వెళ్లింది. ఆయన ఒప్పుకోవడంతో ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 'శివ', 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం' తర్వాత నాగార్జునకు మాస్ ఆడియన్స్‌లో ఉన్న ఇమేజ్‌ను ఈ సినిమా మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.

ఈ సినిమా తెలుగులో సాధించిన అపారమైన విజయం చూసి హిందీలో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్, రంభ కాంబినేషన్‌లో డేవిడ్ ధావన్ ‘జుడ్వా’ (1997) పేరుతో పునర్మించారు. ఆ తర్వాత 'జుడ్వా 2' (వరlevel ధావన్) కూడా వచ్చింది. తమిళంలో కార్తీతో 'సిరుతై' దర్శకుడు శివ తీయడానికి పునాది పడింది.

66
ప్లస్ - మైనస్ పాయింట్స్
Image Credit : Asianet News

ప్లస్ - మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్ :

నాగార్జున ద్విపాత్రాభినయం , కామెడీ టైమింగ్.

రాజ్-కోటి అందించిన బ్లాక్‌బస్టర్ మ్యూజిక్.

ఈవీవీ మార్కు నాన్‌స్టాప్ కామెడీ - ఎంటర్‌టైన్‌మెంట్.

రమ్యకృష్ణ, సౌందర్య గ్లామర్ ‌- పర్‌ఫార్మెన్స్.

మైనస్ పాయింట్స్:

లాజిక్‌లేని కొన్ని రిఫ్లెక్స్ యాక్షన్ సీన్లు (కామెడీ కోసం వదిలేస్తే సమస్య లేదు).

సెకండ్ హాఫ్‌లో రొటీన్ విలన్ ప్రతీకార కథనం.

‘హలో బ్రదర్’ ఒక పక్కా ఆల్ రౌండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఎటువంటి గందరగోళం లేకుండా, రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవడానికి అనువైన చిత్రం. నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ అండ్ మాస్, ఎమోషనల్ ఫిల్మ్‌గా ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
వినోదం
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Recommended image2
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Recommended image3
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image2
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved