Asianet News TeluguAsianet News Telugu

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'మహర్షి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల చిత్రబృందం అమెరికాకి వెళ్లింది. అక్కడ భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగిరానున్నారు. సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. 

pooja hegde has no role in usa
Author
Hyderabad, First Published Nov 1, 2018, 10:19 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'మహర్షి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల చిత్రబృందం అమెరికాకి వెళ్లింది. అక్కడ భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగిరానున్నారు. సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.

అయితే అమెరికాలో జరిగిన షెడ్యూల్ లో హాట్ బ్యూటీ పూజా హెగ్డే మిస్ అయిందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. పూజా హెగ్డే తను పాల్గొనే సినిమా షూటింగ్ లకి సంబంధించి ఆన్ లొకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. కానీ ఈసారి 'మహర్షి' షూటింగ్ కి సంబంధించి ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు.

'మహర్షి' గోవా షెడ్యూల్ కి సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ అమెరికా షెడ్యూల్ కి సంబంధించి ఎలాంటి ఫోటోలను పోస్ట్ చేయలేదు. ప్రభాస్ 20 సినిమా కోసం ఇటలీ వెళ్లినప్పుడు అక్కడ లైవ్ ఫోటోలని షేర్ చేసింది. అలానే 'అరవింద సమేత' వర్కింగ్ స్టిల్స్ ని ఆన్ లొకేషన్ నుండి షేర్ చేసేది. కానీ మహర్షి అమెరికా షెడ్యూల్ కి సంబంధించి ఫోటోలు షేర్ చేయకపోవడంతో పూజా ఈ షెడ్యూల్ లో పాల్గొనలేదని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో మహేష్ స్టూడెంట్ గా, రైతుగా, సాఫ్ట్ వేర్ కంపనీ యజమానిగా కనిపించనున్నారని తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?

 

Follow Us:
Download App:
  • android
  • ios