user
user icon

telugu News

Chiranjeevi Secret to Success in telugu tbr

Chiranjeevi: ఆ ''మైండ్‌ సెట్‌'' ఉంటే విజయం మీదే.. చిరు సక్సెస్‌ మంత్ర!  

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సాధారణ కానిస్టేబుల్‌ కొడుకుగా పుట్టి.. సినిమాల్లో రాణించాలని లక్ష్యంగా పెట్టుకుని, అంచలంచలుగా ఎదిగి.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. అనేక దశాబ్దాలు మంచి నటుడిగానే కాకుండా.. ఇండస్ట్రీలో నంబర్‌ వన్‌ హీరోగా నిలిచారు. ఆయన నటి ప్రస్తానం గురించి... తన జర్నీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చిరంజీవి అనేక సందర్బాల్లో చెబుతూనే ఉన్నారు. రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మైండ్‌ సెట్ మార్చుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని అన్నారు.  ఆయన చెప్పిన సూచనలు పాటిస్తే.. మీరు తప్పక విజేతలు అవుతారు... అవేంటో తెలుసుకుందామా.. 

Rain Washes Out Punjab vs KKR IPL in telugu tbr

Punjab vs KKR IPL: పంజాబ్‌-కేకేఆర్‌ మ్యాచ్‌ వర్షార్పణం... ఏ జట్టుకు లాభమంటే!

Punjab vs KKR IPL:  ఐపీఎల్ 2025లో శనివారం సాయంత్రం జరిగిన  కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఈడెన్ గార్డెన్స్ వేదకగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా జట్టు కేవలం 7 పరుగుల చేయగా.. ఆ తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతసేపటికీ ఆగిపోకపోవడంతో చాల సేపు అంతరాయం ఏర్పడింది. మధ్యలో కాస్త వర్షం ఆగినట్టు కనిపించగా.. మ్యాచ్‌ను ఎంపైర్లు ప్రారంభించారు. ఈ సమయంలో మరోసారి వాన ప్రారంభంకావడంతో  ఇక మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. రెండు జట్లకు చెరోపాయింట్‌ ఇచ్చారు. 
 

TS CM Revanth Reddy says Public Trust in Congress

Bharat Summit 2025 : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకంత నమ్మకమంటే..: రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నమ్ముతున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అన్నివర్గాల ఆకాంక్షలను నెరవేర్చేలా ఇప్పటివరకు ఏం చేసారో కూడా తెలియజేసారు. ఇలా భారత్ సమ్మిట్ 2025 లో తెలంగాణ సీఎం ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.