మహా భారతం ప్రకారం గోళ్లు ఎందుకు కొరకకూడదో తెలుసా?
మహాభారతం ప్రకారం, గోళ్ళు కొరకడం మంచిది కాదు. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఈ చిన్న విషయం వెనుక పెద్ద కారణం దాగి ఉంది, దాని గురించి మనకు తెలియదు.

nail biting
మహాభారతం ఒక మహత్తరమైన గ్రంధం మాత్రమే కాకుండా, మనుషుల జీవితానికి మార్గదర్శకం కూడా. ఇందులో చెప్పిన ప్రతీ విషయానికి లోతైన అర్థం ఉంటుంది. భీష్మ పితామహుడు, అంపశయ్య పై పడుకుని యుధిష్ఠిరుడికి ఇచ్చిన ఉపదేశాలు జీవిత బోధనలతో నిండిపోయి ఉంటాయి. ఆయుష్షు తగ్గించే అలవాట్ల గురించి కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. అందులో గోళ్ళు కొరికే అలవాటు ముఖ్యమైనదిగా పేర్కొన్నాడు.
మనుషుల ఆయుష్షు 100 సంవత్సరాలు అని మహాభారతం చెబుతోంది, కానీ కొన్ని కారణాల వల్ల వారి వయస్సు తగ్గుతూ వచ్చింది. మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి అనేక విషయాలు చెప్పాడు, వాటి వల్ల మనుషుల ఆయుష్షు తగ్గుతుంది. గోళ్ళు కొరకడం కూడా అందులో ఒకటి. వినడానికి ఇది వింతగా అనిపించినా, ప్రస్తుతం జరిగిన వైద్య పరిశోధనలను తెలుసుకుంటే మీరు కూడా దీన్ని నమ్ముతారు.
గోళ్ళు కొరకడం వల్ల ఆరోగ్య సమస్యలు:
గోళ్ళలోకి బయట ధూళి, మట్టి చేరుతూ ఉంటుంది. ఈ మట్టిలో చాలా ప్రమాదకరమైన బాక్టీరియా, వైరస్‌లు ఉండే అవకాశం ఉంటుంది. మనం గోళ్ళు కొరికేటప్పుడు అవి నేరుగా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి పేగులు, కాలేయం, కిడ్నీ వంటి ముఖ్యమైన అవయవాలకు దెబ్బతీయవచ్చు. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లే చివరికి పెద్ద సమస్యలకు దారితీయవచ్చు.
ఆధ్యాత్మిక కారణం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోళ్ళు శనిగ్రహానికి సంబంధించినవిగా పరిగణిస్తారు. శని గ్రహం కర్మాధిపతిగా, శ్రద్ధ లేకుండా గోళ్ళు కొరకడం లేదా శుభ్రంగా ఉంచకపోవడం వల్ల శని కుపితుడవుతాడని నమ్మకం ఉంది. దీని ప్రభావంగా వ్యక్తికి శని దోషం రావచ్చు. ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి, అనవసరమైన నష్టాలు కూడా ఎదురవుతాయి.
గోళ్ళు కొరికే అలవాటు చిన్న విషయం లాంటిదే అనిపించినా, అది ఆరోగ్యపరంగా , ఆధ్యాత్మికంగా రెండూ నష్టాన్ని కలిగించగలదు. అందుకే పిల్లల దగ్గరినుండే ఈ అలవాటును దూరం పెట్టేలా చూడాలి. శుభ్రత పాటించడం, గోళ్ళను టైం టూ టైం కత్తిరించడం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం. చిన్న అలవాట్లే పెద్ద జీవితానికి మార్గాన్ని నిర్ణయిస్తాయని మహాభారతం తెలియజేస్తుంది.