IPL: పంజాబ్ కోల్‌కతా మధ్య శనివారం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు దమ్మురేపారు. ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కోల్‌కతా నైట్ రైడర్స్‌ బౌలర్లపై తొలి ఓవర్‌ నుంచే విరుచుకుపడ్డారు. ఎడాపెడా సిక్సులు బాదారు. ఇద్దరూ కలిపి తొలి వికెట్‌కు 120 పరుగులు భాగస్వాయంతో పంజాబ్ భారీ స్కోర్‌ సాధించింది.  

పంజాబ్ కోల్‌కతా మధ్య శనివారం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు దమ్మురేపారు. ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కోల్‌కతా నైట్ రైడర్స్‌ బౌలర్లపై తొలి ఓవర్‌ నుంచే విరుచుకుపడ్డారు. ఎడాపెడా సిక్సులు బాదారు. ఇద్దరూ కలిపి తొలి వికెట్‌కు 120 పరుగులు భాగస్వాయంతో పంజాబ్ భారీ స్కోర్‌ సాధించింది. 

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు.. ఆ జట్టు ఒపెనర్లు మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభు సిమ్రాన్‌ సింగ్‌ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ.. స్కోర్‌ బోర్డును పరిగెత్తించారు. పోటాపోటీగా షాట్‌లు కొడుతూ.. బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి పంజాబ్‌ భారీ స్కోర్‌ చేసింది. సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న టీనేజ్‌ కుర్రాడు పియాన్ష్‌ ఆర్య కేకేఆర్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓ దశలో అతిని బ్యాటింగ్‌ చూసి సెంచరీ చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. 

పంజాబ్‌ జట్టులో ఒపెనర్ల తర్వాత క్రీజులోకి వచ్చిన జట్టు కెప్టెన్‌ శ్రేయస్ అయ్యార్‌ 25 పరుగులు, ఇంగ్లిస్‌ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మ్యాక్స్‌వెల్ 7, మార్కో యాన్సెన్‌ 3 సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా రెండు, వరుణ్‌ చక్రవర్తి, రస్సెల్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఓపెనర్లు మంచి శుభారంభం ఇవ్వడంతో పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.