MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • గుడ్ న్యూస్.. రేపు మీ అకౌంట్లలోకి రూ. 20 వేలు

గుడ్ న్యూస్.. రేపు మీ అకౌంట్లలోకి రూ. 20 వేలు

AP government Rs 20,000 scheme: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఈ పథకంతో చాలా మందికి ప్రయోజనం కలగనుంది. రేపు మీ అకౌంట్లలో రూ.20 వేల రూపాయలు జమ అవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 25 2025, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

AP government Rs 20,000 matsyakara bharosa scheme:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్. రేపు రూ.20 వేలు అకౌంట్లలోకి వస్తాయని ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అదే మత్స్యకార భరోసా పథకం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. చేపల వేటపై ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిషేధం విధించబడే నేపథ్యంలో, మత్స్యకారుల ఉపాధికి అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం..మత్స్యకార భరోసా మొత్తం రూ.10 వేలు నుండి రూ.20 వేలకు పెంచారు. మొత్తం 1,22,968 మంది మత్స్యకారులు ఈ సాయాన్ని పొందనున్నారు.

గతంలో ఉన్న అర్హత నిబంధనలను సైతం తొలగించి, మత్స్యశాఖలో నమోదు అయిన అన్ని పడవలకూ ఈ పథకం వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

34
Chandrababu Naidu

Chandrababu Naidu

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మత్స్యకార భరోసా నిధుల అందజేత

శనివారం (ఏప్రిల్ 26)న సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం లో ఈ మత్స్యకార భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా నేరుగా మత్స్యకారులకు సాయం అందించనున్నారు. అలాగే, చంద్రబాబు వారితో కొంత సమయం ముచ్చటించనున్నారు. 

44
Chandrababu Pawan

Chandrababu Pawan

చేపలవేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు భరోసా

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 16 వరకు చేపల ఉత్పత్తి కాలం కావడంతో వేటపై నిషేధం ఉంటుంది. దీంతో సమయంలో మత్స్యకారులకు ఉపాధి తగ్గిపోవడం సహజం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసింది.

గతంలో వైకాపా ప్రభుత్వం ఈ పథకం లబ్దిదారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించేంది. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
అమరావతి
విశాఖపట్నం
తెలుగుదేశం పార్టీ
జనసేన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పం ఋణం తీర్చుకుంటున్న బాబు | Chandrababu Kuppam Tour | Asianet News Telugu
Recommended image2
Now Playing
మా 90's కిడ్స్ కి చంద్రబాబు అంటే ఒక ఎమోషన్ | Chandrababu fan moment | Asianet News Telugu
Recommended image3
Now Playing
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు | YS Sharmila Meets YS Jagan | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved