Moral story: బంగారమైనా సరే.. అతి ఎప్పటికీ అనర్థమే, ఈ కథ అదే చెప్తుంది
కథలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. జీవితానికి కావాల్సిన సందేశాన్ని అందిస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Moral story
ఒకానొక సమయంలో కాసులాబాద్ అనే గ్రామంలో రవి అనే అతను ఉండేవాడు. అతను చాలా అత్యాశపరుడు. ఉన్నదాంతో ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు కాదు. ఈ క్రమంలోనే రవి ఒక రోజు అడవి నుంచి వెళ్లే సమయంలో అతనికి ఒక విచిత్రమైన రాయి కనిపిస్తుంది.
Gold Treasure
ఆ రాయితో ఏ వస్తువును రాసినా వెంటనే బంగారంగా మారుతుంది. దీంతో ఆ రాయిని తీసుకొని ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. అనంతరం రాయితో ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులన్నింటినీ బంగారంగా మార్చేశాడు. కొద్ది రోజుల్లో ఇంట్లో బంగారం పెద్ద ఎత్తున నిండిపోయింది.
gold rice
అయితే రవి అక్కడితో ఆగిపోలేదు. తన అత్యాశతో ఇంకా ఎక్కువ బంగారం కావాలనుకున్నాడు. అత్యశతో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను బంగారంగా మార్చసాగాడు. చివరికి భోజనం తీనే పాత్రలే కాకుండా నీటిని, బియ్యాన్ని కూడా బంగారంగా మార్చేశాడు.
Motivational story
అదే సమయంలో అనుకోకుండా అకాల వర్షంతో పంటలు ధ్వంసమయ్యాయి. తగినంత పంట లభించలేదు. ఇంట్లో తినడానికి బియ్యం లేక, నీళ్లు లేక రవి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటి నిండా బంగారం ఉన్నా తినలేని దుస్థితి ఏర్పడింది. చివరికి... తన అత్యాశే తన మనుగడకు ముప్పు తెచ్చిందని గ్రహించాడు. కానీ అప్పటికే తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
నీతి: మనిషికి జీవితంలో ఆశ ఉండాలి కానీ.. అత్యాశ ఉండకూడదనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.