నిరంతర వాడకం, వేసవి వేడి వల్ల స్మార్ట్‌ఫోన్ త్వరగా వేడెక్కుతుంది.
ఎక్కువగా వేడెక్కడం వల్ల ఫోన్ పనితీరు మందగించవచ్చు. బ్యాటరీ ఉబ్బవచ్చు. ఫోన్ పేలి మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉంది.
ఫోన్‌ను ఎప్పుడూ నేరుగా ఎండలో, వేడిగా ఉన్న కారులో వదిలేయవద్దు. చల్లని, నీడ ఉన్న ప్రదేశంలో ఉంచండి.
ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు గేమింగ్, వీడియో కాల్ వంటివి వాటికి దూరంగా ఉండండి. దీనివల్ల వేడి పెరుగుతుంది.
అవసరం లేకపోయినా కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఫోన్‌ను వేడి చేస్తాయి. ఎప్పటికప్పుడు వాటిని మూసివేయండి.
GPS, గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ యాప్‌లు ప్రాసెసర్‌పై భారం పడేలా చేస్తాయి. వేసవిలో వీటి వాడకాన్ని పరిమితం చేయండి.
ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుంటే, దాని కవర్‌ను వెంటనే తీసివేయండి. తేలికైన, గాలి ప్రసరణ ఉన్న కవర్‌ను మాత్రమే ఉపయోగించండి.
ఫోన్‌ను ఆపేసి, చల్లని ప్రదేశంలో ఉంచండి. కానీ ఫ్రిజ్‌లో ఉంచవద్దు. ఫోన్ సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు దాన్ని ఉపయోగించకపోవడం మంచిది.