Punjab vs KKR IPL: పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం... ఏ జట్టుకు లాభమంటే!
Punjab vs KKR IPL: ఐపీఎల్ 2025లో శనివారం సాయంత్రం జరిగిన కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈడెన్ గార్డెన్స్ వేదకగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్కతా జట్టు కేవలం 7 పరుగుల చేయగా.. ఆ తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతసేపటికీ ఆగిపోకపోవడంతో చాల సేపు అంతరాయం ఏర్పడింది. మధ్యలో కాస్త వర్షం ఆగినట్టు కనిపించగా.. మ్యాచ్ను ఎంపైర్లు ప్రారంభించారు. ఈ సమయంలో మరోసారి వాన ప్రారంభంకావడంతో ఇక మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. రెండు జట్లకు చెరోపాయింట్ ఇచ్చారు.