పవన్ బ్రహ్మాస్త్రం లోకల్ బాణం కాదు: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 31, 2019, 6:05 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

మోడీ కొలువులోకి ఎపి నేతలు: సుజనా వర్సెస్ పురంధేశ్వరి

ఏపీ రాష్ట్రం నుండి  మోడీ కేబినెట్ లో భవిష్యత్తులో ఎవరికి చోటు దక్కుతోంది. సుజనా చౌదరి, పురంధేశ్వరీ మధ్య కేబినెట్ మంత్రి పదవి కోసం పోటీ సాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

 

శ్రీముఖి ఖతర్నాక్ ఐడియా.. వారిద్దరే టార్గెట్

బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం హౌస్ నుంచి నటి హేమని సాగనంపారు. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కోసం ఏకంగా 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. టైటిల్ గెలిచే రేసులో ఉన్న సెలెబ్రిటీలంతా ఈ వారం నామినేట్ కావడం ఆసక్తిని రేపుతోంది. శ్రీముఖి, హిమజ, పునర్నవి, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, రాహుల్ ఉన్నారు. 

 

వైసీపీ మహిళా ఎంపీ చింతా అనురాధకు కేంద్రం కీలక పదవి

న్యూఢిల్లీ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ చింతా అనురాధకు కీలక పదవి కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం. చింతా అనురాధను కోకోనట్‌ బోర్డు సభ్యురాలిగా నియమిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ బుధవారం ప్రకటించింది.

 

కేశినేని బుడబుక్కలోడు అంటూ... పీవీపీ విమర్శలు

కేశినేని  పేరు ఎత్తకుండా కౌంటర్లు ఇవ్వడం ఇక్కడ విశేషం. శ్రీశ్రీ కవితలు, సుమతీ శతకాలతో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి కవితను ఉపయోగించి కేశినేనికి పీవీపీ కౌంటర్ ఇచ్చారు.

 

సీబీఐ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లే మీరా మాట్లాడేది : విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్

ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు భావించి అవాకులు చవాకులు పేలుతున్నారని విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. రావాలి, కావాలి అన్న ప్రజలే రోడ్డెక్కి ప్రశ్నిస్తుంటే వెన్నులో వణుకు పుట్టి, సీబీఐ కోర్టు అనుమతితో విదేశాలకెళ్లే మీరు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడడం శిశుపాలుడిని గుర్తుకు తెస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

 

పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మాస్త్రం, లోకల్ బాణంలా వాడొద్దు: నాగబాబు

పవన్ కళ్యాణ్ కంటే తాను ఇంట్లో పెద్దవ్యక్తిని అయినా తాను పార్టీ పరంగా ఏనాడు ప్రశ్నించలేదని, ప్రశ్నించబోనన్నారు. నిజమైన పార్టీ కార్యకర్తలు నాయకుడిని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఎంతో విజన్ ఉన్న నాయకుడు అని ఆయన ఏం చెప్పినా కళ్లు మూసి చేయాల్సిందేనని తిరిగి ప్రశ్నించొద్దంటూ చెప్పుకొచ్చారు. నెవర్ క్వశ్చన్ టూ యువర్ లీడర్ అంటూ హితవు పలికారు. 

 

తలలు, బుగ్గలు నిమరలేను.. ఎన్టీఆర్‌లా నా పక్కన ఎవరూ లేరు: పవన్ వ్యాఖ్యలు

బుగ్గలు నిమిరి, తలలు నిమిరితే ఓట్లు పడతాయంటే తనకు అలాంటి రాజకీయాలు అవసరం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ  పెట్టినప్పుడు అనుభవజ్ఞులు, మేథావులు పక్కన నిలబడ్డారని.. కానీ నా పక్కన ఎవరూ లేరని జనసేనాని వాపోయారు.

 

చేతులెత్తేసిన రఘువీరా: ఎపీ కాంగ్రెసు చీఫ్ గా నల్లారి?

ఏపీ రాష్ట్రానికి కొత్త పీపీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తోందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు నేతల పేర్లను కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తోంది. అయితే ఈ పదవిని తీసుకొనేందుకు నేతలు ఆసక్తిగా ఉన్నారా అనేది ప్రస్తుతం చర్చసాగుతోంది.

 

స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్: జగన్ కొలువులోకి రేపోమాపో

స్టీఫెన్ రవీంద్రకు  ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా  నియామకానికి లైన్ క్లియరైంది. కేంద్ర హోంశాఖ నుండి రెండు మూడు రోజుల్లో  ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.స్టీఫెన్ రవీంద్ర వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన వద్ద సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు.

 

 

విద్యార్ధినితో టీచర్ జంప్: 6 నెలల గర్భంతో ఇంటికొచ్చిన బాలిక

విద్యాబుద్ధులు నేర్పించి, విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే.. మాయమాటలతో ప్రేమ పాటలు చెప్పి తల్లిని చేశాడు. తొమ్మిది నెలల తర్వాత అదృశ్యమైన తమ బిడ్డ.. ఆరు నెలల గర్భవతిగా ఇంటికి రావడంతో తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

కక్షగట్టి పోలవరం పనులు ఆపించారు: జగన్‌పై దేవినేని ఫైర్

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్‌లపై వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని నదులను అనుసంధానం చేసేందుకు చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేస్తే జగన్ ఓర్చుకోలేకపోతున్నారని దేవినేని మండిపడ్డారు.

 

ఆగస్టు మొదటి వారంలో... సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

 

ఆగస్టు 6,7 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ తో సమావేశం కానున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ దృష్టికి రాష్ట్ర సమస్యలు, పెండింగ్ లో ఉన్న అంశాలను వివరించనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు.
 

మీకు చేతకాకపోతే.. నేను చేసి చూపిస్తా... జగన్ కి కేశినేని సవాల్

విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సవాల్ విసిరారు. బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ జాప్యంపై కేశినేని నాని ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు చేతకాకపోతే చెప్పాలని.. తాను చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి రూ.1,250కోట్ల నిధుల విడుదల చేయించటంలో... రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ట్విట్టర్‌ వేదికగా కేశినేని నాని ఫైర్ అయ్యారు.
 

కాపు రిజర్వేషన్లు: ఐదు శాతం కోటాపై జగన్ సర్కార్ మెలిక

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. చంద్రబాబునాయుడు సర్కార్ ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లను కల్పించిన విషయం తెలిసిందే. 

 

రాష్ట్ర ఖజానా ఒక చింతమడకకేనా, ఇంతలా మోసం చేస్తారా : కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్

చింతమడకకు ఇచ్చిన మాదిరిగానే రాష్ట్రంలోని బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీశారు. రైతులకు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 
 

 

గవర్నర్ తో భేటీపై కేటీఆర్ ఏమన్నారంటే.....

గవర్నర్ నరసింహన్ కలవడంపై వస్తున్న ఊహాగానాలకు కేటీఆర్ తెరదించారు. గవర్నర్ తమకు తండ్రి లాంటి వారు అని చెప్పుకొచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఎలా ఉన్నావంటూ గవర్నర్ అడిగారని ఆ నేపథ్యంలో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చానని కేటీఆర్ స్పష్టం చేశారు.
 

 

కేసీఆర్ కి చెప్పి సస్పెండ్ చేయిస్తా.. పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబసభ్యులు మాదాపూర్ లో ట్రాఫిక్ పోలీసులకు మధ్య వివాదం చోటుచేసుకుంది.ఈ వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను భార్య విమాలా భానుతోపాటు... వారి కుమార్తె, అల్లుడు కూడా ఉన్నారు.

 

ఒకసారి కలిశాను... సిద్ధార్థ మృతిపై కేటీఆర్ దిగ్భ్రాంతి

సిద్ధార్థ ఆకస్మిక మరణం చాలా బాధను కలిగించిందని కేటీఆర్ అన్నారు. ఈ వార్త తెలియగానే చాలా దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థను కలిసే అవకాశం వచ్చినట్లు ఆయన చెప్పారు. 

 

కూకట్‌పల్లిలో చిరుత సంచారం: భయాందోళనల్లో జనం

హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లి మిథిలానగర్‌లో చిరుత పులి  సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం నాడు తెల్లవారుజాము వరకు చిరుతపులిని స్థానికులు గుర్తించారు. చిరుతను సెల్‌ఫోన్‌లో గుర్తించారు.

 

అమ్మాయిలతో ఎఫైర్లు, నిలదీసిన భార్య: భర్త ఏం చేశాడంటే..?

పలువురు అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉండటంతో భర్తను నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో అతను ఉద్యోగం వదిలి సొంతవూరికి వెళ్లిపోయాడు. అక్కడితో ఆగకుండా ఆమె మెయిల్ ఐడీతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలో భార్యకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు.. అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేయడం ఆరంభించాడు

 

కమల్ హాసన్ కంటతడి, పవన్ పై ఎఫెక్ట్.. మీడియాలో రచ్చ చేసిన చిత్రాలు!

సినిమాల విషయంలో వివాదాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని వివాదాలు ఆ చిత్రాల హీరోలు దర్శకులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. 

 

శ్రీముఖి ఖతర్నాక్ ఐడియా.. వారిద్దరే టార్గెట్

బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం హౌస్ నుంచి నటి హేమని సాగనంపారు. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కోసం ఏకంగా 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. టైటిల్ గెలిచే రేసులో ఉన్న సెలెబ్రిటీలంతా ఈ వారం నామినేట్ కావడం ఆసక్తిని రేపుతోంది. శ్రీముఖి, హిమజ, పునర్నవి, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, రాహుల్ ఉన్నారు. 

 

సన్నీలియోన్ కోసం అతనికి రోజుకు 150 ఫోన్‌కాల్స్‌

ఒక్కసారి ఊహించండి...మీ పర్శనల్ నంబర్ కు ఒకే రోజు కొన్ని వందల కాల్స్ కంటిన్యూగా వస్తే...అదీ మిమ్మల్ని సన్నిలియోన్ అనుకుని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే...అవతలి వాళ్లు కాదా అని నిరాశతో తిట్టిపోస్తే ఎలా ఉంటుంది. చాలా దారుణమైన సిట్యువేషన్ కదా...ఇప్పుడు డిల్లీ నివాసి పునీత్ అగర్వాల్ ది పరిస్దితి అదే. సన్ని లియోన్ అనుకుని ఆయనకు తెగ కాల్స్ చేస్తున్నారు. 

 

ఉదయభాను విషయంలో నా భార్య వార్నింగ్ ఇచ్చింది: బాబా భాస్కర్!

 యాంకర్ ఉదయభాను విషయంలో మాత్రం తన భార్య వార్నింగ్ ఇచ్చిందని నవ్వుకుంటూ చెప్పారు బాబా భాస్కర్. ఉదయభానుతో కలిసి 'ఢీ2' షోకి యాంకరింగ్ చేశానని.. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకునేవాళ్లని.. కానీ అలాంటిదేమీ లేదని అన్నారు. 

 

సౌత్ సెలబ్రిటీలు వాడే లగ్జరీ కార్లు ఇవే..!

సినిమాల్లో మన హీరో, హీరోయిన్లు కథకు తగ్గట్లు పేద, మిడిల్ క్లాస్, రిచ్ గా కనిపిస్తుంటారు.

 

'సాహో'కి ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే!

సాధారణంగా స్టార్ హీరోల రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలు అధికారికంగా బయటకి రావు.. 'సాహో' సినిమా సంబంధించిన కూడా రెమ్యునరేషన్స్గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ సినిమా కోసం  ప్రభాస్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

 

సిగ్గు లేకుండా కాపీ కొట్టారు.. కంగనా కొత్త సినిమా వివాదం!

రాజ్‌కుమార్ రావ్, కంగనా  హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'జడ్జ్‌మెంటల్ హై క్యా'. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి డైరక్టర్. జూలై 26న సినిమా విడుదలైన ఈ సినిమా పోస్టర్‌పై తాజాగా పెద్ద వివాదం చేలరేగింది.

 

బిగ్ బాస్ 3: పునర్నవి కారణంగా వరుణ్, వితికాల మధ్య గొడవ!

బిగ్ బాస్ హౌస్‌ నుండి హేమ ఎలిమినేట్ కావడం.. తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్‌లో వాటర్‌తో పాటు గ్యాస్ కూడా ఆపేశారు బిగ్ బాస్.. వీటికోసం పాట్లు పడుతున్నారు కంటెస్టెంట్స్..
 

 

click me!