కమల్ హాసన్ కంటతడి, పవన్ పై ఎఫెక్ట్.. మీడియాలో రచ్చ చేసిన చిత్రాలు!

First Published 31, Jul 2019, 5:28 PM

సినిమాల విషయంలో వివాదాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని వివాదాలు ఆ చిత్రాల హీరోలు దర్శకులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. 

కెమెరామన్ గంగతో రాంబాబు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో విడుదలైన రాంబాబు తీవ్రమైన వివాదంగా మారింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఈ వివాదం రాంబాబు చిత్ర వసూళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.

రక్త చరిత్ర 2 : వర్మ ఏ చిత్రం తీసినా వివాదమే. రక్త చరిత్ర చిత్రంలో రాయలసీమ ఫ్యాక్షన్ ని వక్రీకరించి చూపించారనే విమర్శలు ఎదురయ్యాయి.

కొమరం పులి : పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం కూడా టైటిల్ విషయంలో వివాదం జరిగింది. ఉద్యమ వీరుడు కొమరం భీం పేరుని టైటిల్ లో వాడకూడదు అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. దీనితో టైటిల్ నుంచి కొమరం అనే పదాన్ని తొలగించారు.

ఖడ్గం : కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం చిత్రం మతపరమైన వివాదాలకు కారణమైంది.

బాహుబలి : బాహుబలి చిత్రంలో ప్రభాస్, తమన్నా మధ్య సాగే ఓ సన్నివేశం పై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. శివగామి పాత్రలో రమ్యకృష్ణని అద్భుతంగా చూపించిన రాజమౌళి, తమన్నా పాత్రని మాత్రం చాలా చెత్తగా రూపొందించారని కొందరు మహిళలు మీడియా వేదికగా ప్రశ్నించారు.

మిస్టర్ నూకయ్య : మంచు మనోజ్ నటించిన ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదంగా మారింది. మొదట ఈ చిత్రానికి మిస్టర్ నోకియా అనే టైటిల్ పెట్టారు. నోకియా సంస్థ పిటిషన్ వేయడంతో నూకయ్యగా టైటిల్ మార్చారు.

విశ్వరూపం : కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం మతపరమైన వివాదాలకు కారణం అయింది. అప్పట్లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడు సర్కార్ ఈ చిత్ర విడుదలని కొన్ని రోజులపాటు ఆపేసారు కూడా. దీనితో కమల్ హాసన్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ : వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఇది, వర్మ ఈ చిత్రాన్ని లక్ష్మి పార్వతి కోణంలో తెరకెక్కించారని టిడిపి నేతలు మండిపడ్డారు. కోర్టులో కేసు వలన ఈ చిత్ర విడుదల కొన్ని రోజుల పాటు ఆలస్యమైంది.

రాజావారి చేపల చెరువు : పోసాని కృష్ణ మురళి తెరక్కించిన ఈ చిత్రం పెద్ద రాజకీయ వివాదానికి కారణమైంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చిత్రం తెరక్కించారంటూ మీడియాలో చర్చ జరిగింది. పోసాని స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.

మెర్సల్ : ఇళయదళపతి విజయ్ నటించిన మెర్సల్ అద్భుతమైన విజయంగా నిలిచింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మోడీ సర్కార్ పై సెటైర్స్ వేసే విధంగా ఉన్నాయని బిజెపి నేతలు పెద్ద హంగామానే చేశారు.

సర్కార్ : ఇది కూడా విజయ్ నటించిన చిత్రమే. గత ఏడాది విడుదలైన ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జయలలితని కించపరిచే విధంగా ఈ చితం ఉందంటూ పెద్ద రచ్చ జరిగింది. మురుగదాస్ పై కేసు కూడా నమోదు చేశారు.

loader