కాపీ వివాదం లేని పెద్ద సినిమాలు ఉండటం  లేదు. పోస్టర్ దగ్గర నుంచి ఎక్కడ లేపేస్తున్నారో  నెటిజన్స్  పట్టేస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ పుణ్యమా అని ఒరిజనల్ క్రియేటర్స్ ఈ కాపీ విషయాలు ఇట్టే చేరిపోతున్నారు. దాంతో వాళ్లు మీడియాలో రచ్చ రచ్చ చేసి మేకర్స్ పరువు తీసేస్తున్నారు. ఇప్పుడు కంగన తాజా చిత్రం  `జడ్జ్‌మెంటల్ హై క్యా`కు అదే పరిస్దితి ఎదురైంది. ఆ సినిమా ఇప్పుడో కాపీ వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే..

రాజ్‌కుమార్ రావ్, కంగనా  హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం `జడ్జ్‌మెంటల్ హై క్యా`. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి డైరక్టర్ .  జూలై 26న సినిమా విడుదలైన  ఈ సినిమా పోస్టర్‌పై  తాజాగా పెద్ద వివాదం చేలరేగింది. హంగేరీకి చెందిన ఫ్లోరా బోర్సీ అనే లేడీ ఫొటోగ్రాఫర్ తన అనుమతి లేకుండా తన ఆర్ట్‌ను ఉపయోగించుకున్నారని టీమ్‌పై విమర్శలు చేశారు. తన ఫొటోగ్రఫీని, సినిమాలో ఉపయోగించిన పోస్టర్‌ను ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

'ఇదొక ప్రముఖ బాలీవుడ్ సినిమా. కనీసం వారు నా అనుమతి కూడా తీసుకోలేదు. పెద్ద కంపెనీలు కూడా నాలాంటి ఫ్రీ లాన్స్ జర్నలిస్టుల క్రియేటివిటీని దొంగిలించడం సిగ్గుచేటు' అని విమర్శలు చేశారు.

ఈ వివాదంలో నెటిజన్స్ ఫ్లోరా బోర్సీకి అండగా నిలబడుతున్నారు. `ఫర్మిషన్  లేకుండా క్రియేటివిటీని దొంగిలించి సొమ్ము చేసుకుంటున్నారు. సిగ్గుగా అనిపించడం లేదా?` అని నిలదీస్తున్నారు.. `మా బాలీవుడ్ వాళ్లకు ఇదొక అలవాటైంది. సినిమా మొత్తం కాపీయే అయ్యుంటుంది. మేం సిగ్గుపడుతున్నాం` అంటూ నెటిజన్స్ ఫ్లోరాకు మద్దతు తెలుపుతున్నారు. మరి ఈ వ్యవహారంపై దర్శక,నిర్మాతలు, కంగన ఎలా స్పందిస్తారో చూడాలి.