రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. 'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయంలో హల్చల్ చేస్తోంది.

సాధారణంగా స్టార్ హీరోల రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలు అధికారికంగా బయటకి రావు.. 'సాహో' సినిమా సంబంధించిన కూడా రెమ్యునరేషన్స్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు సినిమా కోసం పారితోషికం తీసుకోని ప్రభాస్ ప్రీరిలీజ్ బిజినెస్ లో యాభై శాతం వాటా తన పారితోషికంగా తీసుకోబోతున్నాడట. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంటే ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ వందకోట్లకు పైమాటే.. అదే గనుక నిజమైతే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల సరసన ప్రభాస్ నిలవనున్నాడు. అంతేకాదు.. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ల కన్నా ప్రభాస్ రెమ్యునరేషన్ ఎక్కువ అవుతుంది. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఆగస్ట్ 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.