హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లి మిథిలానగర్‌లో చిరుత పులి  సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం నాడు తెల్లవారుజాము వరకు చిరుతపులిని స్థానికులు గుర్తించారు. చిరుతను సెల్‌ఫోన్‌లో గుర్తించారు.

స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.అటవీశాఖాధికారులు బుధవారం నాడు ఉదయం  ఈ ప్రాంతంలో  గాలింపు చర్యలు చేపట్టారు. మిథిలానగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ లో దూరి కొందరిని గాయపర్చినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయమై స్పష్టత రాలేదు.

కూకట్‌పల్లిలోని మిథిలానగర్ ప్రాంతంలో చిరుత సంచరించినట్టుగా చెబుతున్న ప్రాంతంలో అటవీ శాఖాధికారులు గాలిస్తున్నారు. చిరుత కాలి గుర్తులను ఫారెస్ట్ అధికారులు సేకరిస్తున్నారు.

ఇక్కడికి సమీపంలోని నర్సాపూర్ అటవీ ప్రాంతం అంతరించిపోయింది. ఈ కారణంగానే  అటవీ ప్రాంతం నుండి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నట్టుగా అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.