బిగ్ బాస్ సీజన్ 3 మంగళవారం నటితో పది ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా తన ఆట మొదలెట్టింది. అర్ధరాత్రి అందరూ పడుకున్న తరువాత రవికృష్ణ మైక్, చెప్పులు దాచేసి అతడిని కాసేపు ఏడిపించింది. ఆ తరువాత వితికాకు హౌస్ మేట్స్ తో చిన్న డిస్కషన్ నడిచింది. ఇది ఇలా ఉండగా.. బిగ్ బాస్ లో గ్యాస్, కరెంట్, వాటర్ ని వృధా చేస్తుండడంతో బిగ్ బాస్ కంటెస్టంట్స్ కి శిక్ష విధించారు.

వాటి విలువ తెలుసుకోవడం కోసం మూడు సైకిల్స్ ఇచ్చి వాటిని తొక్కడం ద్వారా గ్యాస్, కరెంట్, వాటర్ లను ఉత్పత్తి చేసుకోవాలని ఆదేశించి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. మొదటి శ్రీముఖి సైకిల్ ఎక్కడంతో ఒకరి తరువాత ఒకరని కాకుండా.. టీంలుగా విడిపోయి సైకిల్ తొక్కితే బాగుంటుందని శివజ్యోతి గొడవ మొదలుపెట్టింది. ఇప్పుడు సైకిల్ తొక్కేసి రాత్రికి హ్యాపీగా పడుకోవచ్చని శ్రీముఖి అనడం శివజ్యోతికి నచ్చలేదు.

మిగిలిన వారి పరిస్థితి ఏంటని వాదించింది. మరోపక్క వితికా, పునర్నవిల మధ్య గొడవ మొదలైంది. అందరూ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తుంటే.. నువ్ ఒక్కదానివే వంటగదిలో 
ఉండడం కరెక్ట్ కాదని.. పునర్నవి వితికాతో అనడంతో వివాదం మొదలైంది. తను అందరికీ దోసెలు వేసి పెట్టానని.. ఖాళీగా ఏం కూర్చోలేదని వితికా.. పునర్నవిపై ఫైర్ అయింది.

ఈ సందర్భంలో వితికా భర్త వరుణ్ సందేశ్.. పునర్నవికి సపోర్ట్ చేయడంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది వితికా.. కాసేపు వరుణ్-వితికాల మధ్య డిస్కషన్ జరగడం, ఆ తరువాత ఒకరికొకరు సారీ చెప్పుకొని కాంప్రమైజ్ అయిపోయారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నా.. శ్రీముఖి గురించి తాను ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ అంతే లేదని మిగిలిన కంటెస్టంట్స్ తో చర్చించింది. జాఫర్ కూడా ఆమెకి వంత పాడారు.