Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కి చెప్పి సస్పెండ్ చేయిస్తా.. పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబసభ్యులు మాదాపూర్ లో ట్రాఫిక్ పోలీసులకు మధ్య వివాదం చోటుచేసుకుంది.ఈ వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను భార్య విమాలా భానుతోపాటు... వారి కుమార్తె, అల్లుడు కూడా ఉన్నారు.

ycp mla samineni udaya bhanu wife warning to traffic police in madhapur
Author
Hyderabad, First Published Jul 31, 2019, 1:45 PM IST

కేసీఆర్ తో చెప్పి.. మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా అంటూ... వైసీపీ ఎమ్మెల్యే భార్య పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన సంఘటన మాదాపూర్ లో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబసభ్యులు మాదాపూర్ లో ట్రాఫిక్ పోలీసులకు మధ్య వివాదం చోటుచేసుకుంది.

ఈ వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను భార్య విమాలా భానుతోపాటు... వారి కుమార్తె, అల్లుడు కూడా ఉన్నారు. మహిళలను నెట్టడం సరికాదని.. సీఎం కేసీఆర్‌తో చెప్పి సస్పెండ్ చేయిస్తానని ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మాదాపూర్ ఖానామిట్ట వద్ద ట్రాఫిక్ పోలీసులు విధినిర్వహణలో ఉన్నప్పుడు కొన్ని వాహనాలను ఆపారు. ఆ వాహనాల్లో ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు ప్రసాద్ వాహనం కూడా ఉంది. పోలీసులు తమ వాహనాన్ని అన్యాయంగా ఎక్కువసేపు ఆపారంటూ ప్రసాద్ పోలీసులతో గొడవపడ్డారు. 

దీంతో పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ప్రసాద్ వినకుండా ఘర్షణకు దిగుతూ.. విధుల్లో ఉన్న ట్రిఫిక్ ఎస్ఐపై దాడి చేసి కాలితో తన్నారు. ఎస్ఐ పిర్యాదు మేరకు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు. ఇది జరిగిన కొద్ది నిముషాలకే ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబసభ్యులు వచ్చి ఎస్ఐ రాజగోపాల్ రెడ్డితో గొడవకు దిగారు. వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

related news

ట్రాఫిక్‌ ఎస్ఐపై దాడి: హైదరాబాద్‌లో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి హల్‌చల్

Follow Us:
Download App:
  • android
  • ios