ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. పదిహేను మంది సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా నిలబడుతున్నారు. షోకి వెళ్లకముందు ఆయన ఓ అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్, ప్రేమ, పెళ్లి ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. తన భార్య కూడా డాన్సర్ అని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో వేరే కాపురం పెట్టినట్లు.. ఆ తరువాత మెల్లగా అందరూ మాట్లాడడం మొదలుపెట్టారని.. ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నామని చెప్పారు.

అయితే ఓ యాంకర్ కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారట కదా అంటూ ప్రశ్నించగా.. వెంటనే బాబా భాస్కర్ నవ్వేసి అది తప్పుడు సమాచారమని అన్నారు. యాంకర్ ఉదయభాను విషయంలో మాత్రం తన భార్య వార్నింగ్ ఇచ్చిందని నవ్వుకుంటూ చెప్పారు. ఉదయభానుతో కలిసి 'ఢీ2' షోకి యాంకరింగ్ చేశానని.. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకునేవాళ్లని.. కానీ అలాంటిదేమీ లేదని అన్నారు.

ఇద్దరం గాడ్ అండ్ డెవిల్ లా ఉండేవాళ్లమని.. తను గాడ్.. ఉదయభాను డెవిల్ అని చెప్పి నవ్వేశారు. స్టేజ్ పై వీరిద్దరి మధ్య జరిగే సరదా గొడవలు తన భార్య కి మరోలా అర్ధమయ్యేవని 
చెప్పారు. 'ఏంటీ ఆ అమ్మాయితో ఎప్పుడూ కలిసి ఉంటావు.. చేతులు పట్టుకుంటావు' అని అడిగేదని, తను ఓవరాక్షన్ చేస్తున్నానని సరదాగా వార్నింగ్ ఇచ్చిన మాట నిజమేనని చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఏదైనా షోకు డాన్స్ చేసేప్పుడు చేతులు పట్టుకుంటాం.. దాన్ని తప్పుగా తీసుకుంటే ఏం చేయలేం అంటూ వెల్లడించారు.