హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను కలవడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆగష్టు 6న తెలంగాణ రాష్ట్రమంత్రి వర్గ విస్తరణ జరగబోతుందంటూ ఆ నేపథ్యంలో గవర్నర్ ను కేటీఆర్  కలిశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈసారి మంత్రి వర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.

గవర్నర్ నరసింహన్ కలవడంపై వస్తున్న ఊహాగానాలకు కేటీఆర్ తెరదించారు. గవర్నర్ తమకు తండ్రి లాంటి వారు అని చెప్పుకొచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఎలా ఉన్నావంటూ గవర్నర్ అడిగారని ఆ నేపథ్యంలో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చానని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

గడ్డాలు తీయమన్నారు, ఇప్పుడేమైంది: కేటీఆర్ సెటైర్లు