ఒక్కసారి ఊహించండి...మీ పర్శనల్ నంబర్ కు ఒకే రోజు కొన్ని వందల కాల్స్ కంటిన్యూగా వస్తే...అదీ మిమ్మల్ని సన్నిలియోన్ అనుకుని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే...అవతలి వాళ్లు కాదా అని నిరాశతో తిట్టిపోస్తే ఎలా ఉంటుంది. చాలా దారుణమైన సిట్యువేషన్ కదా...ఇప్పుడు డిల్లీ నివాసి పునీత్ అగర్వాల్ ది పరిస్దితి అదే. సన్ని లియోన్ అనుకుని ఆయనకు తెగ కాల్స్ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే సిట్యువేషన్. అయితే ఎందుకు ఆ కాల్స్ వస్తున్నాయి..ఆయన ఏం చేయబోతున్నారు.

మొన్న శుక్రవారం అర్జున్ పాటియాలా సినిమా రిలీజైంది. ఆ సినిమాలో సన్నిలియోన్ ఓ సాంగ్ చేసింది. ఆ పాట అయ్యాక తన నెంబర్ ని లీడ్ యాక్టర్ కు ఇస్తుంది. ఆ నెంబర్ క్లియర్ గా తెరపై కనపడుతుంది. అయితే సాధారణంగా అలా ఇచ్చే నెంబర్లు ని ఆ సినిమా వాళ్లే తీసుకుంటారు. ఎందుకంటే తర్వాత ఏ సమస్యా రాకూడదని. అయితే దురదృష్టవశాత్తు ఆ టీమ్ ఆ పనిచేయలేదు. తమ నోటికొచ్చిన నెంబర్ ని ప్రకటించేసారు. దాంతో ఆ నెంబర్ కలిగి ఉన్న పునీత్ కు సమస్య ఎదురైంది.  

తాను ఆ ఫోన్ నుంచి వచ్చే కాల్స్, వీడియోలు, మెసేజ్ లతో చాలా టార్చర్ అనుభవిస్తున్నాని అన్నారు. చాలా అసభ్యకరమైన మెసేజ్ లు సైతం రావటం ఆయన్ని బాధిస్తోంది. దాంతో ఈ సినిమా దర్శక,నిర్మాతలను కోర్ట్ కు లాగాలనుకుంటున్నాడు ఆయన. చివరకు ఏమౌతుందో చూడాలి.