విజయవాడ ఎంపీ కేశినేని నానికీ, వైసీపీ నేత పీవీపీకి మధ్య ట్వీట్ వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఒకరు చేసిన ట్వీట్ కి మరోకొరు కౌంటర్లు ఇస్తూ... సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా పీవీపీ ఈ విషయంలో కాస్త ముందుంటున్నారనే చెప్పాలి. కేశినేని ఇలా ఏదైనా ట్వీట్ చేశారంటే చాలు... దానికి పీవీపీ నుంచి కౌంటర్ వచ్చేస్తోంది.

మరీ ముఖ్యంగా కేశినేని  పేరు ఎత్తకుండా కౌంటర్లు ఇవ్వడం ఇక్కడ విశేషం. శ్రీశ్రీ కవితలు, సుమతీ శతకాలతో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి కవితను ఉపయోగించి కేశినేనికి కౌంటర్ ఇచ్చారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే... విజయవాడ బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ని ఉద్దేశించి ఈ రోజు ఉదయం కేశినేని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కి చేతకాకపోతే తాను చేస్తానంటూ కేశినేని సవాల్ విసిరారు.  ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని మీరు ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద సమస్యలను ఎలా పరిష్కరిస్తారు జగన్ గారు అంటూ పోస్టు చేశారు. దీనికి పీవీపీ స్పందించారు.

గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా గేయంలోని  ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అనే వ్యాఖ్యలతో కేశినేని పై విమర్శలు చేశారు. ‘ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేలు తలపెట్టవోయి, సొంత లాభం కొంత మానుకొని, పొరుగు వానికి తోడుపడవోయ్, దేశమంటే తెలుగు దేశం కాదోయ్, నువ్వు జీతాలు ఎగ్గొట్టిన కార్మికులు కూడా మనుషులోయ్,కాస్త వారి కష్టాలు చూడవోయ్’’ అ ంటూ సెటైర్లు వేశారు.

కేశినేని ట్రావెల్స్ మాజీ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన వివాదంపై కూడా పీవీపీ స్పందించారు. ‘‘ బండ బాబాయ్,నీ బస్సు స్టీరింగ్ ముందు కూర్చొని, నీ బోర్ కి వచ్చిన బండిని టీడీపీ షెడ్డుకు  తీసుకువెళ్లావా లేక బీజేపీ షెడ్డుకా ముందు  చెప్పు. ఆ తర్వాత జనాల సమస్యలు ఏ మాత్రం తీరుస్తావో మేమూ  చూస్తాం. ప్రతి బుడబుక్కలోడు వాగేవాడు అయిపోయాడు మన ప్రజల కర్మ’’ అంటూ విమర్శించారు.