న్యూఢిల్లీ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ చింతా అనురాధకు కీలక పదవి కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం. చింతా అనురాధను కోకోనట్‌ బోర్డు సభ్యురాలిగా నియమిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ బుధవారం ప్రకటించింది.

కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోకోనట్ బోర్డు పనిచేస్తుంది. దేశంలో కొబ్బరి ఉత్పత్తుల అభివృద్ధికి, కొబ్బరి సాగు విస్తీర్ణం పెంచడానికి, కొత్త వంగడాలు సృష్టించడం వంటి అంశాలపై  ఈ బోర్డు పని చేస్తోంది. 

ఇకపోతే మహిళా ఎంపీ చింతా అనురాధ 2019 ఎన్నికల్లో అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ పై ఘన విజయం సాధించారు.