చేతులెత్తేసిన రఘువీరా: ఎపీ కాంగ్రెసు చీఫ్ గా నల్లారి?

First Published 31, Jul 2019, 1:25 PM

ఏపీ రాష్ట్రానికి కొత్త పీపీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తోందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు నేతల పేర్లను కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తోంది. అయితే ఈ పదవిని తీసుకొనేందుకు నేతలు ఆసక్తిగా ఉన్నారా అనేది ప్రస్తుతం చర్చసాగుతోంది.

ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే విషయమై ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.

అయితే ఈ రాజీనామాను ఆమోదించాలని   కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆయన కోరారు.ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వం ఇంకా ఎటూ తేల్చలేదు.పలువురు నేతల పేర్లను కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా 2014లో విభజించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ  కీలక పాత్ర పోషించిందని ఏపీలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడ లేకుండా చేశారు ప్రజలు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండా చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ కు తెలంగాణలో కూడ ఏ మాత్రం ఆశించిన మేరకు ఫలితాలు దక్కలేదు. 2014, 2018 ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తక్కువ స్థానాలకే పరిమితమైంది. తెలంగాణలో  కూడ పార్టీని కాపాడుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

రాష్ట్ర విభజన కారణంగా ఏపీ లో కాంగ్రెస్ కు చెందిన నేతలు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.

ఈ  రాజీనామాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆమోదించలేదు. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్వేషణ సాగిస్తోంది.  మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. 2014 తర్వాత కూడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరాలని యోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వడం ద్వారా బీజేపీ చేరికకు చెక్ పెట్టొచ్చని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

చింతా మోహన్, కనుమూరి బాపిరాజు, శైలజనాధ్ తదితరుల పేర్లు కూడ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం నేతల మధ్య పోటా పోటీ వాతావరణం ఒకప్పుడు ఉండేది.

ప్రస్తుతం ఈ పదవిని ముళ్ల కిరీటంగా నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు ఎవరికి కట్టబెడుతారోననేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏపీ రాష్ట్రంపై బీజేపీ కూడ ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో ఉన్న ఒకరిద్దరిని కూడ కాపాడుకోవాలంటే కనీసం పార్టీ పదవులు ఇవ్వాలనే యోచనలో ఆ పార్టీ నాయత్వం ఉన్నట్టుగా కన్పిస్తోంది.

loader