బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం హౌస్ నుంచి నటి హేమని సాగనంపారు. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కోసం ఏకంగా 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. టైటిల్ గెలిచే రేసులో ఉన్న సెలెబ్రిటీలంతా ఈ వారం నామినేట్ కావడం ఆసక్తిని రేపుతోంది. శ్రీముఖి, హిమజ, పునర్నవి, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, రాహుల్ ఉన్నారు. 

వీరిలో శ్రీముఖి, హిమజ, పునర్నవి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. శ్రీముఖి తనగెలుపుకు అడ్డుగా ఎవరున్నారనే విషయాన్ని పసిగట్టి టార్గెట్ చేస్తోందనే టాక్ ప్రేక్షకుల్లో వ్యాపించింది. శ్రీముఖిపై ప్రేక్షకుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అదేస్థాయిలో ఆమెని అభిమానించే వారు కూడా ఉన్నారు. 

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా బయట సిచ్యుయేషన్ ని హౌస్ లో కొందరితో సీక్రెట్ గా పంచుకుంది. శ్రీముఖి బయట అంతా సెట్ చేసుకుని వచ్చిందని.. ఆమె గెలుపు కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయని తమన్నా తెలిపింది. అందుకు తగ్గట్లుగానే శ్రీముఖి సోషల్ మీడియా టీమ్ ఆమెకు ఓట్లు పడేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

రెండవ వారం నామినేషన్ శ్రీముఖికి అంత ప్రమాదమేమీ కాదు. శ్రీముఖి, పునర్నవి, హిమజకు ఓట్లు వేయడానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ట్రెండ్స్ అలానే ఉన్నాయి. ఇక వరుణ్ కి బాగానే ఓట్స్ పడుతున్నా.. వితికకు మాత్రం ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. చిన్న విషయానికి కూడా హడావిడి చేస్తుందనే అభిప్రాయం నెలకొంది. 

రాహుల్, జాఫర్, మహేష్ కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. చూడాలి సెకండ్ వీక్ లో ఎలిమినేషన్ వేటు ఎవరిపై పడుతుందో. ఇదిలా ఉండగా హీరోయిన్ శ్రద్దా దాస్, మరో నటి హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.