ఆటాడుకున్న 'బేబీ' సమంత: మహిళలకు బంగారం చేదు

By rajesh yFirst Published Jul 5, 2019, 6:34 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

*ఓ బేబి* రివ్యూ: ఫన్ కు చాబి

ప్రక్క భాషలో హిట్టైన సినిమాల రీమేక్ రైట్స్ కొనుక్కొచ్చి సినిమా చేయటంలో పెద్ద వింతేమీ లేదు. అది సహజంగా సినిమా పుట్టిన నాటి నుంచీ జరుగుతున్న పక్రియే. అయితే కొరియో భాష లో హిట్టైన సినిమాను తీసుకొచ్చి ఇక్కడ రీమేక్ చేయాలనుకోవటం మాత్రం సాహసమే. అందులోనూ మనకు హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనగానే సందేశాలు, ఏడుపులు, దెయ్యాలు, నాగినిలు. అయితే ఇది పూర్తిగా కామెడీ సినిమా. అప్పుడెప్పుడో ఇవివి గారు మగరాయుడు అంటూ విజయశాంతితో చేసినటువంటి కామెడీ టైప్. ఈ నేపధ్యంలో వచ్చిన  ఈ రీమేక్ సినిమా మన తెలుగు వాళ్లను ఆకట్టుకుంటుందా..అసలు  రైట్స్ తీసుకుని మరీ రీమేక్  చేయాలనిపించేటంత విషయం ఈ సినిమాలో ఉందా..వంటి విషయాలు  రివ్యూలో చూద్దాం. 

 

ఇదే నా చివరి ప్రపంచ కప్: భావోద్వేగానికి లోనైన క్రిస్ గేల్

విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ చివరి ప్రపంచ కప్ మ్యాచ్ అనంతరం  భావోద్వేగానికి లోనయ్యాడు. అతి త్వరలో తనకెంతో ఇష్టమైన క్రికెట్ కు దూరమవుతున్నానన్న ఆలోచనే ఎంతో బాధిస్తోందన్నాడు.

 

ధోనీ మరో రెండేళ్లు ఆడగలడు, ఆడాలి కూడా: మలింగ

ధోనీ మరో రెండేళ్లు ఆడగలడని లసిత్ మలింగ అన్నాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫనిషర్ ఇప్పటికీ ధోనీయేనని అన్నాడు. ధోనీ లోటును తీర్చడం కష్టమని, ధోనీ చేసి యువ క్రీడాకారులు నేర్చుకోవాలని అన్నాడు. 

 

సమీరారెడ్డి ఫోటోషూట్.. షాకవ్వాల్సిందే!

నటి సమీరారెడ్డి ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఇలాంటి సమయంలో ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. 

 

స్టార్ హీరోయిన్లందరూ ఆ గదిలోకి ఎలా వెళ్తున్నారు..?

దర్శకుడు ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో సీక్వెల్ గా 'రాజు గారి గది 2' వచ్చింది. ఇందులో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్లు నటించారు. ఈ సినిమాకి ఏవరేజ్ మార్కులు పడినప్పటికీ ఇప్పుడు 'రాజు గారి గది 3' తీయడానికి సిద్ధమైపోయారు. 

 

షోలో ఉన్నట్లుగా బయట ఉండరు.. గీతామాధురి కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 1తో ఎంతో సరదాగా సాగిపోయింది. సీజన్ 2కి వచ్చేసరికి వివాదాలు ఎక్కువయ్యాయి. కౌశల్ తో మిగిలిన ఇంటి సభ్యుల గొడవలు ఒకరిపై మరొకరు ద్వేషాలు పెంచుకునే వరకూ వెళ్లింది. త్వరలోనే సీజన్ 3 మొదలుకానుంది.

 

మా అక్కది నిజమైన ప్రేమ కాదు.. హృతిక్ రోషన్ సంచలన వ్యాఖ్యలు!

స్టార్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాము ముస్లిం వ్యక్తిని ప్రేమించాననే కారణంతో తన కుటుంబ సభ్యులే వేధింపులకు గురిచేస్తున్నారని సునయన ఆరోపించారు. 

 

భర్త మిస్సింగ్ అంటూ నటి ప్రకటన.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

సినిమాల ప్రమోషన్స్ కోసం మన తారలు రకరకాల స్ట్రాటజీలు ఫాలో అవుతుంటారు. అయితే ఒక్కోసారి వాటి కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా మలయాళ నటి ఆశా శరత్ కి అలాంటి అనుభవమే ఎదురైంది.

 

చైతు.. సమంతను రికమండ్ చేస్తాడా..?

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత దాదాపు అగ్ర దర్శకులు, స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది. 

 

 

పవన్ న్యూ లుక్.. సినిమాల్లోకి రావాలని ఫ్యాన్స్ రచ్చ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబందించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, చాలా కాలం తరువాత పవన్ జీన్స్ సింపుల్ టీ షర్ట్ తో కనిపించడంతో ఫ్యాన్స్ రచ్చ డోస్ మొదలైంది. సాధారణంగా పవర్ స్టార్ కి సంబందించిన ఏ లుక్ వచ్చిన ఓ రేంజ్ లో రచ్చ మొదలెట్టే అభిమానులు ఇప్పుడు ఆ డోస్ మరింతగా పెంచేశారు. 

 

 

బిగ్ బాస్ కంటెస్టంట్ పై చీటింగ్ కేసు!

నటి మీరామిథున్ '8 తూట్టాగళ్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. దక్షిణ భారతీయ అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకొని.. ఇటీవల సొంతంగా అందాల పోటీలను నిర్వహించడానికి ప్లాన్ చేసి వివాదాలలో చిక్కుకుంది.

 

 

మహేశ్‌, జూ.ఎన్టీఆర్‌, బన్నీ వంటివారయితే... :సమంత

సమంత, సీనియర్‌ నటి లక్ష్మి , రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ నటించిన చిత్రం 'ఓ బేబీ'.  ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.... ఓ రేంజిలో గత కొద్ది రోజులుగా సమంత ప్రమోట్ చేస్తోంది. తన సొంత ప్రొడక్షన్ లో సినిమా కన్నా ఎక్కువగా శ్రద్ద చూపిస్తోంది. అందుకు కారణం ఆమె మీడియాతో చెప్పింది. 
 

 

చీకటి రోజు: టీడీపీ కార్యకర్తలపై దాడులపై బాబు

 తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడాన్ని  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన దాడులకు పాల్పడడాన్ని చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు.

 

ఏపీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు, కేంద్రబడ్జెట్ నిరాశపరచింది: విజయసాయిరెడ్డి

మరోవైపు కార్మికులకు పెన్షన్ల ఇచ్చే నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనన్నారు. అయితే ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని విజయసాయిరెడ్డి  వ్యాఖ్యానించారు.

 

 

'విత్త' కష్టాలు: తెలియాల్సింది జగన్మోహన్ రెడ్డికే

ఐదేళ్ళ క్రితం - ‘కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడు’ అనుకున్నరాష్ట్ర ప్రజలకు వారికి కూడా సరిపడినంత అనుభవం కలిగాక, ఇప్పుడు అనుభవం లేని నేతకు వాళ్ళు ప్రభుత్వాన్నిఏకపక్షంగా అప్పగించారు. 

 

కేంద్ర బడ్జెట్‌ 2019: పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గు

పెట్రోల్,  డీజీల్‌పై  అదనంగా ఒక్క శాతం ఎక్సైజ్  సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. దీంతో  పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
 

 

కేంద్ర బడ్జెట్... పాన్ తో పనిలేదు.. ఇక ‘ఆధార్’ ఆధారం

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కాగా ఈ బడ్జెట్ ద్వారా పాన్ కార్డ్ లేని వారికోసం ఓ వెసులుబాటు తీసుకువచ్చారు.  పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లను పరస్పరం వినియోగించుకునేలా వెసులుబాటు తీసుకువచ్చారు. పాన్ కార్డ్ లేకున్నా.. కేవలం ఆధార్ కార్డ్ ని వినియోగించుకోవచ్చని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
 

 

కేంద్ర బడ్జెట్... స్టాక్ మార్కెట్లు కుదేలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా దీని ప్రభావం స్టాక్ మార్కెట్స్ పై పడింది. ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారో లేదో.. అలా స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. 
 

 

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

ఏడాదికి ఐదు లక్షల ఆదాయం దాటితేనే  ఆదాయపు పన్ను చెల్లించాలని  కేంద్రం ప్రకటించింది.  ఐదు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్రం తేల్చేసింది.

 

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

దేశంలో రైల్వే శాఖలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీపీపీ మోడల్‌లో రైల్వే శాఖలో  సంస్కరణలను తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  తెలిపారు.
 

 

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్ తొలిసారిగా శుక్రవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తమ కూతురు ప్రవేశపెట్టే బడ్జెట్‌ ప్రసంగాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులు శుక్రవారం నాడు పార్లమెంట్‌కు వచ్చారు.
 

 

బన్నీ లగ్జరీ వ్యానిటీ వ్యాన్ చూశారా..?

లిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతీ వస్తువు చాలా స్టైలిష్ గా ఉండాలని కోరుకుంటాడు
 

 

కూతురిచ్చిన వాంగ్మూలంతో వనిత సేఫ్!

ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తండ్రితో ఆస్తుల గొడవలతో కోర్టుకెక్కిన ఈమెపై ఇటీవల కిడ్నాప్ కేసు కూడా పెట్టారు.
 

 

కేంద్ర బడ్జెట్... ప్రభుత్వం కురిపించిన వరాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని శుక్రవారం ప్రవేశపెట్టింది. తొలిసారి బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ చదివి వినిపించారు. చాలా ఆసక్తిగా ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
 

 

ఆసీస్ కు ఎదురు దెబ్బ: గాయంతో షాన్ మార్ష్ ఔట్

ప్రపంచ కప్ పోటీలు కీలకమైన దశకు చేరుకుంటున్న సమయంలో ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. షాన్ మార్ష్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో హ్యాండ్స్ కోంబ్ జట్టులో చేరుతున్నాడు. ఈ విషయాన్ని ఐసిసి ప్రకటించింది. 
 

 

బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయాన్ని మార్చేసిన నిర్మలా సీతారామన్

దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ మరికాసేపట్లో వెల్లడికానుంది. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

కేంద్ర బడ్జెట్... నిర్మలాసీతారామన్ టీం ఇదే..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తొలిసారి నేడు నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే కావడంతో... దీనిపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 
 

 

ఏ పనీలేక.. వ్యభిచారం చేస్తున్నారు.. ఎంపీ గోరంట్ల మాధవ్

చేయడానికి ఏ పనీలేక మహిళలు.. వ్యభిచారంలోకి దిగుతున్నారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. లోక్ సభలో వ్యవసాయ సంక్షేమం గురించి మాట్లాడిన ఆయన పైవిధంగా కామెంట్స్ చేశారు.

 

మీవాళ్ల దౌర్జన్యాలు ఇలాగే జరిగితే మిగిలేవి ఇవే...: జగన్ పై లోకేష్ సెటైర్లు

ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు అని అభిప్రాయపడ్డారు. 

 

బడ్జెట్‌లో మహిళలకు భారీ షాక్: పెరగనున్న బంగారం ధరలు

మహిళలు అత్యధికంగా ఆసక్తి చూపే బంగారంపై కస్టమ్స్ చార్జీలను పెంచనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో బంగారం ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరల  కంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

 

 

వైయస్ హత్యా రాజకీయాలకే భయపడలేదు జగన్ కు భయపడతామా: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్యారాజకీయాలతో అనంతపురం జిల్లాలో ఎంతోమంది టీడీపీ నాయకులను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని ఆరోపించారు. జగన్ హత్యా రాజకీయాలకు తాము భయపడేది లేదని హెచ్చరించారు.  
 

 

కేంద్ర బడ్జెట్ 2019: ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తోందంటే....


ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుండే జమ అవుతున్నాయి. ప్రతి రూపాయిలో 68 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుండే  ఖజానాకు చేరుతున్నాయి.

 

ఇలా చేస్తున్నారు: తన భద్రతపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తనకు రక్షణ కల్పించడం లేదు, భద్రత విషయంలో జోక్యం చేసుకొన్నారు, తనకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. 
 

 

కేంద్ర బడ్జెట్ 2019: ఇక రూ.20 నాణెం కూడా

త్వరలోనే కొత్త నగదు నాణెలను చలామణిలోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంధులు గుర్తించే విధంగా కొత్త నాణెలు  అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.

 

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

దేశంలోని ప్రతి  ఇంటికి 2024 నాటికి మంచినీళ్లు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మల సీతారామన్ ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ తరహలోనే ప్రతి ఇంటికి నీటిని అందించేందుకు కేంద్రం నడుం బిగించింది.
 

 

 

 

 

 

 

click me!