ఒంగోలు:  తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడాన్ని  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన దాడులకు పాల్పడడాన్ని చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు.

శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో  వైసీపీ నేతల దాడికి గురై మృతి చెందిన పద్మ కుటుంబాన్ని చంద్రబాబునాయుడు పరామర్శించారు. మృతిచెందిన  పద్మ కుటుంబానికి  బాబు రూ. 7.65 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు.

రాష్ట్రంలో  ఆరు చోట్ల టీడీపీ కార్యకర్తలు హత్యకు గురైతే సీఎం  జగన్ మౌనంగా ఉన్నారని ఆయన చెప్పారు. హత్యా రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో మృతి చెందిన ఆరుగురు కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు.