దర్శకుడు ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో సీక్వెల్ గా 'రాజు గారి గది 2' వచ్చింది. ఇందులో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్లు నటించారు. ఈ సినిమాకి ఏవరేజ్ మార్కులు పడినప్పటికీ ఇప్పుడు 'రాజు గారి గది 3' తీయడానికి సిద్ధమైపోయారు. 

ఇటీవల సినిమా ప్రారంభోత్సవ వేడుక కూడా జరిపారు. తమన్నా హీరోయిన్ గా సినిమాను మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకొంది. దీంతో ఆమె స్థానంలో తాప్సీ, కాజల్ లాంటి హీరోయిన్లను తీసుకోవాలని సంప్రదిస్తున్నాడట. కాజల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తిగానే ఉందని అంటున్నారు. 

తమన్నా కంటే కాజల్ కి క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. అసలు ఇలాంటి హారర్ కథలో కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు నటించేలా ఓంకార్ ఏం చెప్పి ఒప్పిస్తున్నాడనే సంగతి మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

పైగా సినిమాలో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. కాజల్ లాంటి స్టార్ డమ్ ఉన్న తారలు ఇలాంటి హీరోల పక్కన నటించడానికి అంగీకరిస్తున్నారంటే  కచ్చితంగా  కథలో ఇంటరెస్టింగ్ పాయింట్ ఉండే ఉంటుంది.