పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబందించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, చాలా కాలం తరువాత పవన్ జీన్స్ సింపుల్ టీ షర్ట్ తో కనిపించడంతో ఫ్యాన్స్ రచ్చ డోస్ మొదలైంది. సాధారణంగా పవర్ స్టార్ కి సంబందించిన ఏ లుక్ వచ్చిన ఓ రేంజ్ లో రచ్చ మొదలెట్టే అభిమానులు ఇప్పుడు ఆ డోస్ మరింతగా పెంచేశారు. 

రీసెంట్ గా తానా సభల కోసం పవన్ ఈ లుక్ లో వెళ్లాడు. ఎయిర్ పోర్ట్ లో పవన్ ని చూసి అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. మొన్నటివరకు పొలిటిషయన్ గా తనదైన గెటప్ లో నిండు గెడ్డం తో కనిపించిన పవన్ ఇప్పుడు స్టార్ హీరోగా కనిపిస్తున్నాడు. దీంతో ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

అయితే పవన్ మాత్రం పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని పలుమార్లు వివరణ ఇచ్చాడు. అయితే సొంత ప్రొడక్షన్ లో మాత్రం సినిమాలు తెరకెక్కే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. వాషింగ్ టన్ లో జారుతున్న తానా సభల కోసం పవన్ ముఖ్య అతిధిగా వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు