చేయడానికి ఏ పనీలేక మహిళలు.. వ్యభిచారంలోకి దిగుతున్నారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. లోక్ సభలో వ్యవసాయ సంక్షేమం గురించి మాట్లాడిన ఆయన పైవిధంగా కామెంట్స్ చేశారు.

వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘మా ప్రాంతంలో వ్యవసాయంపై ఆదాయం వచ్చేదే తక్కువ. వ్యవసాయేతర రంగంలో ప్రస్తుతం పనులు లేవు. దాంతో మహిళలు ఒళ్లు అమ్ముకునే దుస్థితి నెలకొంది. వ్యభిచారకూపంలోకి వెళ్తున్నారు. వ్యవసాయ సంక్షోభం వల్లే వ్యభిచారం, మహిళల అక్రమ రవాణా జరుగుతోంది. నా నియోజకవర్గంలోనే కాదు దేశమంతా ఇలాగే ఉందన్నది కొట్టివేయలేం. ఉపాధికోసం గల్ఫ్‌ వెళ్తే భారత మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం’ అని పేర్కొన్నారు.