న్యూఢిల్లీ: పెట్రోల్,  డీజీల్‌పై  అదనంగా ఒక్క శాతం ఎక్సైజ్  సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. దీంతో  పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

శుక్రవారం నాడుపార్లమెంట్‌లో  కేంద్ర మంత్రి  నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.   ప్రతి లీటర్ పెట్రోల్, డీజీల్‌కు ఒక్క శాతం ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల  లీటర్‌పై పెట్రోల్‌, డీజీల్‌పై  ఒక్క రూపాయి పెరగనుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా కూడ పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించడం లేదని విపక్షాలు ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా కేంద్రం తీసుకొన్న నిర్ణయం కారణంగా మరోసారి పెట్రోల్, డీజీల్ ద్వారా ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా  కేంద్రానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని  ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగిన సమయంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతున్నారు, అంతర్జాతీయ మార్కెట్ లో  ముడి చమురు ధర తగ్గినా కూడ పెట్రోల్, డీజీల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు