దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత దాదాపు అగ్ర దర్శకులు, స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది. పెద్ద సినిమా అంటే సమంతనే ఫస్ట్ ఆప్షన్ గా ఉండేది. చాలా మందికి ఆమె ఆల్ టైం ఫేవరేట్. అయితే సమంతకు మాత్రం ఫలానా దర్శకుడితో కలిసి పనిచేయాలనే కోరికలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ లిస్ట్ లో శేఖర్ కమ్ముల, మణిరత్నం ఉన్నారని చెబుతోంది. లెజండరీ డైరెక్టర్ మణిశర్మ సినిమాలో ఛాన్స్ అంటే కాస్త కష్టమనే చెప్పాలి. ఆయన చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తుంటాడు. నటీనటులు  అడిగితే ఆయన ఛాన్స్ ఇవ్వడు.. ఆయన స్వయంగా ఎంపిక చేసుకుంటాడు.

ఈ క్రమంలో సమంతకు అవకాశం వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. కానీ శేఖర్ కమ్ములతో సినిమా అంటే కాస్త ప్రయత్నిస్తే.. ఛాన్స్ ఈజీగానే వస్తుంది. సమంత భర్త నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నాడు. చైతుకి కూడా శేఖర్ కమ్ములతో పని చేయాలని కోరిక.

ఫైనల్ గా అది నేరవేరిందంటూ సినిమా అనౌన్స్ చేసినప్పుడు సంతోషంగా ప్రకటించాడు. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు కాబట్టి చైతు తన భార్యని రికమండ్ చేస్తే శేఖర్ కమ్ముల కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే శేఖర్ కమ్ముల మాత్రం సాయి పల్లవిని తీసుకోవాలని భావిస్తున్నాడట. మరేం జరుగుతుందో చూడాలి!