ఒంగోలు: తనకు రక్షణ కల్పించడం లేదు, భద్రత విషయంలో జోక్యం చేసుకొన్నారు, తనకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. 

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో  ఆత్మహత్య చేసుకొన్న పద్మ కుటుంబాన్ని శుక్రవారంనాడు చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా  మాట్లాడారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని  చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.

పద్మను ఇంటి నుండి  రోడ్డుపైకి  ఈడ్చుకెళ్లి కొట్టి చంపారని ఆయన మండిపడ్డారు.  పద్మను వివస్త్రను చేసి సెల్‌పోన్‌లో చిత్రీకరించారని ఆయన చెప్పారు. నిందితులు  దోషులు తిరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని మరో పులివెందుల చేయాలనుకొంటున్నారా ఆయన ప్రశ్నించారు.ప్రజలు తిరగబడితే  మీరేం చేయలేరన్నారు.  
 

సంబంధిత వార్తలు

చీకటి రోజు: టీడీపీ కార్యకర్తలపై దాడులపై బాబు