Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

 ఏడాదికి ఐదు లక్షల ఆదాయం దాటితేనే  ఆదాయపు పన్ను చెల్లించాలని  కేంద్రం ప్రకటించింది.  ఐదు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్రం తేల్చేసింది.

union budget 2019: no income tax for rs 5 lakh
Author
New Delhi, First Published Jul 5, 2019, 1:00 PM IST

 న్యూఢిల్లీ: ఏడాదికి ఐదు లక్షల ఆదాయం దాటితేనే  ఆదాయపు పన్ను చెల్లించాలని  కేంద్రం ప్రకటించింది.  ఐదు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్రం తేల్చేసింది.

శుక్రవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్  బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లలో ప్రత్యక్షపన్నుల ద్వారా 7 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చిన విషయాన్ని  మంత్రి తెలిపారు.

ఐదు లక్షల వార్షిక ఆదాయం ఎక్కువ వారు మాత్రమే ఐటీ పన్ను చెల్లించాలని   మంత్రి తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే రూ. 5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదని కేంద్రం ప్రకటించింది. ఇదే విధానం కొనసాగుతోందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్  శుక్రవారం నాడు ప్రకటించారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవన్నారు.

మరోవైపు పన్ను మినహాయింపుకు సంబంధించి ప్రతిపాదించిన అంశాలను కూడ మంత్రి  వివరించారు. రూ. 400 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు 25 శాతం పన్ను మినహాయింపు  ఇవ్వనున్నట్టు  మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

Follow Us:
Download App:
  • android
  • ios