క్రిస్ గేల్... విధ్వంసానికి మారుపేరు. అది అంతర్జాతీయ మ్యాచులయినా(టెస్ట్, వన్డే,టీ20), ఐపిఎల్ అయినా అతడి ధనాధన్ బ్యాటింగ్ కు ప్రత్యర్థులు చిత్తవ్వాల్సిందే. అతడు క్రీజులో వున్నంత సేపు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి. అలా అంతర్జాతీయ క్రికెట్లో అతడు కేవలం వెస్టిండిస్ జట్టుకు ప్రాతినిద్యం వహించాడన్న మాటే గానీ ప్రపంచవ్యాప్తంగా వున్న యావత్ క్రికెట్ ప్రియులను అలరించాడు. అతడి ఆటకు అందరూ అభిమానులే.  అలాంటి క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ అతి త్వరలో దూరమవనున్నాడు. ఈ సందర్భంగా నిన్న( గురువారం) చివరి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన గేల్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

'' నా బాల్యం నుండి ఇప్పటివరకు సాగిన క్రికెట్ ప్రయాణం మొత్తం ఇప్పుడు కళ్లముందు మెదులుతుంది. నేను ఇక్కడివరకు చేరుకోడానికకి ఎన్నో కష్టాలను అనుభవించాను. తెరముందు నేను చాలా సరదాగా వుండే వ్యక్తినే అయినా తెరవెనకు నా ప్రయాణం వేరుగా వుండేది. అవన్ని బయటపెట్టుకోవడం ఇష్టంలేకే నేను అందరితో సరదాగా వుండటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా వాటిని నేను గుర్తుచేసుకుంటున్నాను తప్ప మీతో(అభిమానులు) పంచుకోవాలని  అనుకోవడం లేదు. 

ఇక ఇదేనా చివరి ప్రపంచ కప్ ముందే ప్రకటించాను కాబట్టి జట్టుకు మరో ట్రోఫీని అందించే క్రికెట్ నుండి తప్పుకోవాలనుకున్నా. అయితే అలా జరక్కపోవడం కొంత బాధిస్తోంది. అయితే ఈ ప్రపంచ కప్ ప్రయాణాన్ని మాత్రం బాగా ఆస్వాదించానని...ఇక్కడి నుండి మంచి జ్ఞాపకాలతో వెళుతున్నాను. 

ఇక తనను క్రికెటర్ గుర్తించి  మంచి అవకాశాలిచ్చిన వెస్టిండిస్ క్రికెట్ కు నేను ఎప్పటికీ రుణపడి వుంటా. స్వదేశంలో భారత్ తో జరిగే సీరిస్ అనంతరం రిటైరయినా  జట్టుకు నా సేవలు కొనసాగుతూనే  వుంటాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లను  మెరుగ్గా తీర్చిదిద్ది విండీస్ జట్టుకు పూర్వవైభవం  కల్పించే దిశగా ప్రయత్నిస్తాను. తనకు ఇప్పటివరకు క్రికెటర్ గా  రాణించడానికి సహకరించిన సహచరులు, ఇతర సిబ్బంది, బోర్డు మరీ  ముఖ్యంగా ప్రేమను పంచిన అభిమానులకు కృతజ్ఞతలు'' అంటూ గేల్ భావోద్వేగానికి లోనయ్యాడు.