న్యూఢిల్లీ: దేశంలో రైల్వే శాఖలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీపీపీ మోడల్‌లో రైల్వే శాఖలో  సంస్కరణలను తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  తెలిపారు.

 శుక్రవారం నాడు  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మల సీతారామన్  పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైల్వేలో  సంస్కరణల కోసం  పెట్టుబడులు అవసరమని మంత్రి చెప్పారు.

ప్రైవేట్ పెట్టుబడులను సేకరించనున్నట్టు ఆమె తెలిపారు. పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్స్‌షిప్) ద్వారా సుమారు  రూ. 50 లక్షలను సేకరించనున్నట్టు ఆమె తెలిపారు.

దేశంలోని రైల్వే స్టేషన్లను  ఆధునికీకరించేందుకు ఈ  పెట్టుబడులను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. పీపీపీ పద్దతిలో ప్రజలకు మెరుగైన సేవలను త్వరగా అందించే అవకాశం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకీకరించనున్నట్టు మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు