స్టార్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాము ముస్లిం వ్యక్తిని ప్రేమించాననే కారణంతో తన కుటుంబ సభ్యులే వేధింపులకు గురిచేస్తున్నారని సునయన ఆరోపించారు. సొంత తమ్ముడు హృతిక్ కూడా తనకు సాయపడడం లేదని, తనపై ద్వేషం పెంచుకుంటున్నాడని సునయన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

తన సొందరి ప్రేమ వ్యవహారం గురించి హృతిక్ రోషన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. మా కుటుంబ సభ్యుల మధ్య అందమైన అనుబంధం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల వరకు మనం ప్రేమని చాలా మందికి పంచుతాం. కాకపోతే కాస్త ఆలోచించగలిగే శక్తి కూడా ఉండాలి. మనపై ప్రేమ చూపించే వారిలో ఎవరిది నిజమైన ప్రేమో తెలుసుకోగలగాలి. 

ప్రేమించే వ్యక్తిపై ఎప్పటికి ద్వేషం రాదు. అలా వస్తే అసలు అది ప్రేమే కాదు అని తన సోదరి గురించి హృతిక్ రోషన్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. తన సోదరిని ప్రేమిస్తున్న ముస్లిం వ్యక్తిది నిజమైన ప్రేమ కాదని, ఆ విషయం సునయన అర్థం చేసుకోవడం లేదని హృతిక్ రోషన్ పరోక్షంగా తెలిపాడు. ఇక తమ కుటుంబ సభ్యులంతా తమ సోదరిని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాం అని తెలిపాడు.