హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసులో రాష్ట్రప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు కేసును జనవరి రెండుకు వాయిదా వేసింది. పోలీసులు చట్టవిరుద్ధంగా రేవంత్ ను నిర్భందించారంటూ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం జనవరి 18న విచారణ జరిపింది. అనంతరం హైకోర్టు కేసును డిసెంబర్ 20కి వాయిదా వేసింది. 

ఇకపోతే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్లు వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ హైకోర్టుకు తెలిపారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరౌతున్నారన్న సభలో అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకు రేవంత్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు.

 రేవంత్ ని అరెస్టు చేయడానికి గల కారణాలను వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ  వివరించారు. రేవంత్ ని అరెస్టు చేయడానికి ముందు బయటకు రావాలని రేవంత్ ని పలుమార్లు పిలిచామని.. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గేట్లు పగలగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. 

గదిలో రేవంత్ తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని వారికి రేవంత్ అరెస్ట్ కు దారితీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు పెట్టాలని కోరగా వారు నిరాకరించారని ఆమె తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే రేవంత్ అరెస్ట్

 

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా