MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.

ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.

Iran Israel war: మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధ వాతావరణం ఇంధన ధరలపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ఆ ప్రభావం భారతదేశంలో కూడా కనిపిస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 07 2026, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం
Image Credit : Gemini AI

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం

మధ్యప్రాచ్యం ప్రపంచానికి ప్రధాన చమురు నిల్వల కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో యుద్ధం లేదా ఉద్రిక్తతలు పెరిగితే చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతాయి. ఆ ప్రభావం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై త్వరగా పడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒక్కసారిగా పెరిగిన LPG ధరలు
Image Credit : X

ఒక్కసారిగా పెరిగిన LPG ధరలు

తాజాగా భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ కంపెనీలు శుక్ర‌వారం అర్థరాత్రి నుంచి కొత్త ధరలను అమలు చేశాయి. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 60 వరకు పెరిగింది. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 114 పెరిగింది. ఈ పెరుగుదల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే కాకుండా సాధారణ కుటుంబాలు కూడా ప్రభావితమవుతున్నాయి.

35
హైదరాబాద్‌లో తాజా ధరలు
Image Credit : X

హైదరాబాద్‌లో తాజా ధరలు

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 960కు చేరింది. ఇంతకు ముందు ఇది రూ. 905గా ఉండేది. కొన్ని చోట్ల డెలివ‌రీ ఛార్జీలతో క‌లిసి రూ. 1000కి చేరింది. అదే సమయంలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1996.50 నుంచి రూ. 2110.50కు పెరిగింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.

45
సాధారణ ప్రజలపై పెరుగుతున్న భారం
Image Credit : X

సాధారణ ప్రజలపై పెరుగుతున్న భారం

గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇంటి ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు గ్యాస్ ధరల పెరుగుదల కూడా జత కావడంతో వంటగది ఖర్చు మరింత భారంగా మారే అవకాశముంది.

55
పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం?
Image Credit : Google

పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం?

నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యప్రాచ్య పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయ మార్కెట్‌పై కూడా అదే ప్రభావం పడుతుంది.

మొత్తానికి మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కేవలం రాజకీయ లేదా సైనిక అంశంగా మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆ ప్రభావం ఇప్పుడు భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో కనిపించడం ప్రారంభమైంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
యుద్ధం
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో 5 ఏళ్ల‌లో ఈ ప‌ట్ట‌ణం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. ఇప్పుడు కొంటే మీ పంట పండిన‌ట్లే
Recommended image2
Danam Nagender : హైదరాబాద్ ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..
Recommended image3
Now Playing
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
Related Stories
Recommended image1
Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.. బీరు బాటిల్లో చేప పిల్ల‌. ఎలా వ‌చ్చింద‌బ్బా?
Recommended image2
మంగ‌ళ‌సూత్రం తీయ‌మ‌న్న‌ప్పుడు ఏడ్చేశా, ఆ ఫుడ్ చూసి వాంతి వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ అయిన క‌విత‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved