Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్ 2.. విక్రమ్ ముక్కలు కాలేదు... ప్రకటించిన ఇస్రో

విక్రమ్ ఒక పక్కకు ఒరిగి ఉండటంతో.. కమ్యునికేషన్‌ను పునురుద్ధరించేందుకు వీలుగా యాంటినాలు సరైన దిశలో ఉన్నాయాలేదా అనే అంశంపై ఇంకా సంగ్ధితత నెలకొంది. ల్యాండర్‌లోని విద్యుత్ వ్యవస్థపై కూడా ఇంక స్పష్టత రాలేదు. కమ్యునికేషన్ పునరుద్ధరించేందుకు యాంటినాలు సరైన దిశలో ఉండటం అత్యావశ్యకం అని  ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. 
 

Vikram intact in one piece: Isro making all-out efforts to restore link with Chandrayaan-2 lander
Author
Hyderabad, First Published Sep 9, 2019, 3:09 PM IST


ఇస్రో పంపిన చంద్రయాన్ 2 గురించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ల్యాండర్ విక్రమ్ బాగానే ఉందని సోమవారం ఇస్రో అధికారులు చెప్పారు. ఆదివారం ల్యాండర్  జాడను కనిపెట్టిన ఇస్రో... ఇప్పుడు అది ఎలా ఉందో తెలుసుకోగలిగింది. చంద్రునిపైకి హార్డ్ ల్యాండింగ్ కావడంతో ల్యాండర్ విక్రమ్ ముక్కలైపోయి ఉంటుందని అందరూ భావించారు. అయితే... విక్రమ్ పరిస్థితి యథాతథంగా ఉందని ఇస్రో అధికారులు అధికారికంగా ప్రకటించారు.

అంతా భావించినట్టు విక్రమ్ ల్యాండర్  ముక్కలవలేదని ఇస్రో తెలిపింది. ప్ర‌జ్ఞాన్ రోవర్..ల్యాండర్ లోపలే ఉన్నట్టు పేర్కొంది. అయితే నిర్దేశిత ల్యాండింగ్ ప్రాంతానికి కొద్ది దూరంలో, విక్రమ్ ఓ పక్కకి ఒరిగి ఉన్నట్టు తెలిపింది. ల్యాండర్‌తో కమ్యునికేషన్‌ను పునరుద్ధరించేందుకు శాస్త్రవేత్తలు ప్రస్తుతం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
 
కాగా..విక్రమ్ ఒక పక్కకు ఒరిగి ఉండటంతో.. కమ్యునికేషన్‌ను పునురుద్ధరించేందుకు వీలుగా యాంటినాలు సరైన దిశలో ఉన్నాయాలేదా అనే అంశంపై ఇంకా సంగ్ధితత నెలకొంది. ల్యాండర్‌లోని విద్యుత్ వ్యవస్థపై కూడా ఇంక స్పష్టత రాలేదు. కమ్యునికేషన్ పునరుద్ధరించేందుకు యాంటినాలు సరైన దిశలో ఉండటం అత్యావశ్యకం అని  ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. 

'ల్యాండర్‌లో ప్రతి వ్యవస్థా క్షేమంగా ఉంటేనే కమ్యునికేషన్ పునరుద్ధరించడం సాధ్యపడుతుంది. సాఫ్ట్ ల్యాండింగ్(మృదువుగా, నిదానంగా చంద్రుడి ఉపరితలంపై దిగటం) కాకపోవడం వలన ఆ ఆవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి' అని మరో శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

చంద్రయాన్-2: ల్యాండర్ విక్రమ్ లోకేషన్ గుర్తింపు

చిన్నారులకు స్ఫూర్తి: చంద్రయాన్ 2పై రవిశాస్త్రి స్పందన

చంద్రయాన్ 2... దక్షిణ ధ్రువమే ఎందుకు ఎంచుకున్నారు..?

భారత్ చంద్రయాన్ 2... ఇజ్రాయిల్ ది కూడా ఇదే కథ

కన్నీరు పెట్టుకున్న ఇస్రో ఛైర్మన్.. హగ్ చేసుకున్న ప్రధాని మోదీ

మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను... శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ

చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

Follow Us:
Download App:
  • android
  • ios