చంద్రయాన్-2 మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. మంగళవారం ఉదయం 9.30కి చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి చేరింది. ఈ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అత్యంత కీలక ఘట్టం..

ఈ ప్రక్రియలో ఉపగ్రహంలోని ద్రవ ఇంజిన్‌ను మండిస్తారు....  చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించి... దశ, దిశ మార్చడంతో చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టనున్నారు శాస్త్రవేత్తలు.

సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో సాఫీగా ల్యాండింగ్ చేయనున్నారు. ల్యాండర్ దిగిన తర్వాత అందులోని ఆరు చక్రాల రోవర్ దాదాపు నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చి.... 14 రోజుల పాటు చంద్రునిపై 500 మీటర్ల దూరం పయనించనుంది. అక్కడ సేకరించిన వివరాలను ల్యాండర్ ద్వారా 15 నిమిషాల్లో భూమిపై చేరవేయనుంది.