Asianet News TeluguAsianet News Telugu

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 తుది ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు చంద్రయాన్-2 చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీన్‌స-సి, సీంపేలియ్‌స-ఎన్ అనే రెండు చంద్రబిలాల మధ్య దిగనుంది. 

Chandrayaan 2's Moon Landing Tonight
Author
New Delhi, First Published Sep 6, 2019, 11:42 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 తుది ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు చంద్రయాన్-2 చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీన్‌స-సి, సీంపేలియ్‌స-ఎన్ అనే రెండు చంద్రబిలాల మధ్య దిగనుంది. ఈ అద్భుతం కోసం భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 

సేఫ్ ల్యాండింగ్ ఇలా: ఇస్రో నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు మండుతూ.. ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ చంద్రయాన్-2 వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి.

ఆ సమయంలో దాని వేగం గంటకు 6,120 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. సరిగ్గా చంద్రుడిపై విక్రమ్ కాలు మోపే వేళలలో అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో వ్యోమనౌకకు అమర్చబడిన సోలార్ ప్లేట్ల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది.

రెండు చంద్రబిలాల మధ్య ఎగుడు దిగుళ్లు లేని సమతలంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా ద్వారా శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు. ఒకవేళ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దిక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు.

ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. ఈ 15 నిమిషాల ప్రక్రియ చంద్రయాన్-2కే ఆయువుపట్టు. అందుకే దీనిని ఇస్రో ఛైర్మన్ 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్‌గా అభివర్ణించారు. 

ఆ 15 నిమిషాలకు ఎందుకంత ప్రాధాన్యత
భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లే, చంద్రునికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రస్తుతం చంద్రుని 35*100 మీటర్ల కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్.. మామూలుగా చంద్రుడి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది.

అలా జరక్కుండా ఉండేందుకు గాను .. శాస్త్రవేత్తలు విక్రమ్‌లోని డైరెక్షనల్ థ్రస్టర్లను మండించడం ద్వారా ఉపగమన వేగాన్ని కొనసాగిస్తూ నెమ్మదిగా దిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా వ్యోమనౌకను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. 

ల్యాండిగ్ సమయంలో పైకి లేచ్ ధూళి కణాలు నాలుగు గంటల తర్వాత సర్దుకుంటుంది. అనంతరం ల్యాండర్ నుంచి ఉదయం 5.30 నుంచి 6.30 మధ్య 27 కిలోల బరువుతో 6 చక్రాలు కలిగిన ప్రజ్ఞాన్ రోవర్ బయటికి వచ్చి 14 రోజుల పాటు పరిశోధనలు చేయుంది. ఈ సమాచారాన్ని విక్రమ్ ద్వారా బైలాలులోని  ఇండియన్ డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌కు అందిస్తుంది. 

మరోవైపు ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ల్యాండింగ్ ప్రక్రియను ప్రధాని నరేంద్రమోడీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి తిలకించున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 9, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్ధులను ఇస్రో ఎంపిక చేసింది. వీరంతా  ప్రధానితో కలిసి చంద్రయాన్-2 ల్యాండిగ్‌ను వీక్షిస్తారు. 

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

Follow Us:
Download App:
  • android
  • ios