Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

భారతదేశ మొట్టమొదటి మూన్ లాండర్ (చంద్రుడిపై దిగనున్న లాండర్ ) విక్రమ్, సెప్టెంబరు 2వ తేదీనాడు విజయవంతంగా చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ నుండి విడిపోయింది. చంద్రుడి దక్షిణధ్రువం  పైన రేపు తెల్లవారుఝామున 1.30-2.30గంటల మధ్య దిగనుంది. 

6 Key things to know about isro's Chandrayaan 2
Author
New Delhi, First Published Sep 6, 2019, 12:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారతదేశ మొట్టమొదటి మూన్ లాండర్ (చంద్రుడిపై దిగనున్న లాండర్ ) విక్రమ్, సెప్టెంబరు 2వ తేదీనాడు విజయవంతంగా చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ నుండి విడిపోయింది. చంద్రుడి దక్షిణధ్రువం  పైన రేపు తెల్లవారుఝామున 1.30-2.30గంటల మధ్య దిగనుంది. 

చంద్రుడిపై దిగిన తరువాత లాండర్ విక్రమ్ నుంచి రోవర్( చంద్రుడిపై తిరిగే) ప్రగ్యాన్ వేరవుతింది. ఇలా బయటకొచ్చిన ప్రగ్యాన్ 14 రోజులపాటు చంద్రుడిపై అనేక పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. 

ఈ మిషన్ ప్రారంభమైన 48 రోజుల తరువాత ఈ లాండర్, రోవర్లు చంద్రుడిపై దిగనున్నాయి. జులై నెల 22వ తేదీన చంద్రయాన్ ప్రయాణం మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. 

చంద్రయాన్-2, చంద్రుడిపైకి భారత్ పంపిన రెండవ మిషన్. 2008లో చంద్రయాన్-1 పేరిట తొలి జాబిల్లి యాత్రను ఇస్రో విజయవంతంగా చేపట్టి చంద్రుడిపై నీటి ఆనవాళ్లను కనుగొని సంచలం సృష్టించింది. 

ఈ చంద్రయాన్ గురించి తెలుసుకోవాలిసిన 6 ముఖ్యమైన అంశాలు. 
1. లాంచ్ వెహికల్(చంద్రయాన్ ను మోసుకెళ్లిన రాకెట్)
2. లాండర్ విక్రమ్ 
3. రోవర్ ప్రగ్యాన్ 
4. ఆర్బిటర్ (చంద్రుని చుట్టూ పరిభ్రమించేది)
5. లాండింగ్ 
6. ఎందుకు దక్షిణ ధృవంపైనే దిగడం?

1. లాంచ్ వెహికల్:

జి ఎస్ ఎల్ వి మాక్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 చంద్రుడిపైకి బయల్దేరింది. భారత దేశ బాహుబలిగా పేర్కొనే ఈ రాకెట్ లో టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డవి. 

2.లాండర్  విక్రమ్:

ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ స్మృత్యర్థం లాండర్ కు విక్రమ్ అని నామకరణం చేసారు. దాదాపు 1500 కిలోల బరువుండే ఈ లాండర్ లోనే రోవర్ ప్రగ్యాన్ ఇమిడి ఉంటుంది.

ఈ లాండర్ చంద్రుడిపై 14 రోజులపాటు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆర్బిటర్, రోవర్లతో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తోంది ఈ లాండర్ విక్రమ్. ఈ లాండర్ నేరుగా చంద్రుడిపై క్రాష్ లాండింగ్ చేస్తూ దిగకుండా మృదువుగా ల్యాండ్ అవుతుంది. 

3. రోవర్ ప్రగ్యాన్ : 

దాదాపు 27కిలోల బరువుండే ఈ రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై తిరుగాడుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. 6 చక్రాలతో తిరుగాడే ఈ రోవర్ కేవలం సౌర శక్తిపైనా మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. 500 మీటర్ల పాటు ఈ రోవర్ చంద్రుడి ఉపరితలం పైన తిరగాడుతుంది. రోవర్ సేకరించిన సమాచారాన్ని విక్రమ్ కి అందజేస్తే, విక్రమ్ దాన్ని భూమికి తిరిగి పంపిస్తుంది. 

4. ఆర్బిటర్: 

సంవత్సర కాలంపాటు చంద్రుడిపై 100x100 కిలోమీటర్ల కక్ష్యలో సంవత్సరం పాటు పరిభ్రమిస్తుంది. ఈ సమయంలో చంద్రుడిని ప్రతి క్షణం ఒక కంట కనిపెడుతూ ఫోటోలు తీస్తూ, భూమి మీదికి సమాచారాన్ని చేరవేస్తుంది. 

5. లాండింగ్ : ఇస్రో నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు మండుతూ.. ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ చంద్రయాన్-2 వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ఆ సమయంలో దాని వేగం గంటకు 6,120 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా.

సరిగ్గా చంద్రుడిపై విక్రమ్ కాలు మోపే వేళలలో అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో వ్యోమనౌకకు అమర్చబడిన సోలార్ ప్లేట్ల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. రెండు చంద్రబిలాల మధ్య ఎగుడు దిగుళ్లు లేని సమతలంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా ద్వారా శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు.

ఒకవేళ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దిక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు.

ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. ఈ 15 నిమిషాల ప్రక్రియ చంద్రయాన్-2కే ఆయువుపట్టు. అందుకే దీనిని ఇస్రో ఛైర్మన్ 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్‌గా అభివర్ణించారు. 

ఆ 15 నిమిషాలకు ఎందుకంత ప్రాధాన్యత
భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లే, చంద్రునికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రస్తుతం చంద్రుని 35*100 మీటర్ల కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్.. మామూలుగా చంద్రుడి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది.

అలా జరక్కుండా ఉండేందుకు గాను .. శాస్త్రవేత్తలు విక్రమ్‌లోని డైరెక్షనల్ థ్రస్టర్లను మండించడం ద్వారా ఉపగమన వేగాన్ని కొనసాగిస్తూ నెమ్మదిగా దిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా వ్యోమనౌకను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. 

6. ఎందుకు దక్షిణ ధృవంపైన్నే లాండింగ్?

దక్షిణ ధృవంపై దిగడానికి ప్రముఖంగా రెండు కారణాలున్నాయి. మొదటిది సౌరశక్తి అధికంగా లభించడం. ఇలా సౌరశక్తి ఈ ప్రాంతంలో అధికంగా ఉండడం వల్ల ఈ పరికరాలు పనిచేయడానికి వేరే ఇంధనాన్నో లేదా బ్యాటరీలనో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు.

మరో విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టలు రాళ్లు తక్కువగా ఉండడం వల్ల సాఫ్ట్ లాండింగ్ కి అనువైన ప్రదేశం తేలికగా లభ్యమవుతుంది. రెండో కారణమేంటంటే సాంకేతికంగా ఈ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో నీటి ఆనవాళ్లు, ఖనిజాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 

మొత్తంగా గనుక చూసుకుంటే,చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ మరికొన్ని గంటల్లో చరిత్ర సృష్టించబోతోంది. 

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

Follow Us:
Download App:
  • android
  • ios