చంద్రయాన్ 2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు నిద్రహారాలు మాని కష్టపడ్డారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శనివారం ఆయన ఇస్రో నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలంతా నిరాశకు గురయ్యారు.

దీంతో వారిలో మనో ధైర్యం నింపేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో నుంచి  జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తొలుత భారత మాతాకీ జై అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు ఎంతకష్టపడ్డారో మోదీ వివరించారు.

ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు నిద్రలు లేని రాత్రులు చాలా గడిపారని చెప్పారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎంత బాధపడుతున్నారో తాను అర్థం చేసుకోగలనని అన్నారు. మీరు చేసిన హార్డ్ వర్క్ దేశం మొత్తానికి తెలుసు అని ఆయన అన్నారు. మరిన్ని లక్ష్యాలను మనం సాధించాల్సి ఉందన్నారు. ఈ అడ్డంకులు మన మనోబలాన్ని మరింత రెట్టింపు చేస్తాయని చెప్పారు.

మనమందరం సంతోషించే మరెన్నో అవకాశాలు మున్ముందు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరెన్నో అంతరిక్ష ప్రయోగాలు మనం చేస్తామంటూ శాస్త్రవెత్తలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు. ఎన్నో ఆటంకాలను ఎదురుకున్న సత్తా ఇస్రోకి ఉందని గుర్తు చేశారు. ప్రతి సమస్య మనకు కొత్త విషయాలను నేర్పుతుందన్నారు.

సంబంధిత వార్తలు

చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్