Asianet News TeluguAsianet News Telugu

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంలో ఇస్రో మరో కీలక ముందడుగు సాధించింది. చంద్రయాన్-2 వ్యోమనౌకను మూడో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం చంద్రుని కక్షలో ఆర్బిటర్ తిరుగుతోంది. సెప్టెంబర్ 7న చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 ఉపగ్రహాలు అడుగుపెట్టనున్నాయి. 

third lunar bound orbit maneuver for chandrayaan-2 spacecraft was performed successfully
Author
Bangalore, First Published Aug 28, 2019, 11:08 AM IST

ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంలో ఇస్రో మరో కీలక ముందడుగు సాధించింది. చంద్రయాన్-2 వ్యోమనౌకను మూడో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం చంద్రుని కక్షలో ఆర్బిటర్ తిరుగుతోంది. సెప్టెంబర్ 7న చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 ఉపగ్రహాలు అడుగుపెట్టనున్నాయి.

కాగా.. చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా ఆర్బిటర్‌కు అమర్చిన టెరియన్ మ్యాపింగ్ కెమెరా సోమవారం చంద్రుని ఫోటోలు తీసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న బెంగళూరు సమీపంలోని బైలాలు భూనియంత్రణ కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే.

చంద్రయాన్-2 మిషన్‌లో ల్యాండర్‌కు అమర్చిన ఉపకరణాలు అద్బుతంగా పనిచేస్తున్నాయని ఇస్రో తెలిపింది. సెప్టెంబర్ 7న ల్యాండర్‌లో అమర్చిన రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై దించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

Follow Us:
Download App:
  • android
  • ios