విశ్వనటుడు కమల్‌హాసన్ (KamalHaasan), పవర్ఫుల్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanakaraj) కాంబినేషన్లో తెరకెక్కిన హైఓల్టేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్’(Vikram). మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకూ థియేటర్లలో అలరించిన ఈ సినిమా శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చింది.