చంద్రయాన్ 2 ప్రయోగంలో ఆఖరి దిశలో సిగ్నల్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే... చంద్రయాన్ 2 ప్రయోగంలో  విక్రమ్ ల్యాండర్ ను దింపేందుకు ఇస్రో చంద్రుడి దక్షిణ ధ్రువాన్నే ఎందుకు ఎంచుకుంది...? ఇస్రో నిర్ణయలో ఎంతో ముందు చూపు ఉందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రదేశంలో ఏ దేశ వ్యోమనౌకా దిగలేదు. దక్షిణ ధ్రువం వద్ద ప్రయోగాలతో ఉన్న మరికొన్ని లాభాలేంటంటే..
 
చంద్రుడి ఉత్తర ధ్రువంతో పోలిస్తే.. దక్షిణ ధ్రువం ఎక్కువ కాలం నీడలో ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ 10 కోట్ల టన్నుల నీరు ఉండొచ్చని భావిస్తున్నారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కొన్ని క్రేటర్లలో వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యుడి వెలుగు పడకపోవడం వల్ల సౌర వ్యవస్థ పుట్టుకకు సంబంధించిన ఆధారాలు అక్కడ పదిలంగా ఉండే అవకాశం ఉంది.

నీడలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో హైడ్రోజన్‌, అమ్మోనియా, మిథేన్‌ మూలకాలు ఉండొచ్చని అంచనా.ఇక్కడ నీటి జాడలను గుర్తిస్తే.. భవిష్యత్‌లో మానవ సహిత యాత్రలకు అవకాశమేర్పడుతుంది. ఈ ప్రదేశం బేస్‌స్టేషన్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందనేది ఇస్రో భావన.