Asianet News TeluguAsianet News Telugu

చిన్నారులకు స్ఫూర్తి: చంద్రయాన్ 2పై రవిశాస్త్రి స్పందన

చంద్రయాన్ 2 ప్రయోగంపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. విక్రమ్ ల్యాండర్ నిర్దేశిత ప్రదేశంలో దిగడంలో విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ, రాహుల్ గాంధీ నుంచి మొదలు దేశ ప్రజలందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Team India Head Coach reacts on Chandrayaan 2
Author
New Delhi, First Published Sep 7, 2019, 1:25 PM IST

న్యూఢిల్లీ: చంద్రయాన్ 2 ప్రయోగంపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రయోగం జాతికే గర్వకారణమని ఆయన అన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచానికే వన్నె తెచ్చారని ఆయన అన్నారు. ఈ తరహా ప్రయోగాల వల్ల లక్షల మంది భారత చిన్నారులకు స్ఫూర్తి లభిస్తుందని ఆయన అన్నారు.

ఆ మేరకు రవిశాస్త్రి ట్వీట్ చేసి జైహింద్ అంటూ ముగించారు. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరి దశలో విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్ దేశ ప్రజలు అండగా నిలుస్తున్నారు. విక్రమ్ ల్యాంజర్ చందమామను చేరుకునే అద్భుతమైన క్షణాల కోసం భారత దేశం యావత్తూ ఉత్కంఠతో ఎదురు చూసింది. 

చివరి క్షణంలో చేదు అనుభవం ఎదురైనప్పటికీ ఇదొక స్ఫూర్తివంతమైన ప్రయోగమని అందరూ ప్రశంసిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ నుంచి అందరూ ఇస్రో శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని ప్రశంసించారు. 

చంద్రయాన్ 2 ప్రయోగం విషయంలో అన్ని సవ్యంగా సాగుతున్నాయని అనుకుంటున్న సమయంలో విక్రమ్ ల్యాండర్ తో చివరి నిమిషంలో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే సమయంలో గందరగోళం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

చంద్రయాన్ 2... దక్షిణ ధ్రువమే ఎందుకు ఎంచుకున్నారు..?

భారత్ చంద్రయాన్ 2... ఇజ్రాయిల్ ది కూడా ఇదే కథ

కన్నీరు పెట్టుకున్న ఇస్రో ఛైర్మన్.. హగ్ చేసుకున్న ప్రధాని మోదీ

మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను... శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ

చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

Follow Us:
Download App:
  • android
  • ios