చంద్రయాన్-2 ప్రాజెక్ట్‌ మరో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మంగళవారం ఉదయం వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ మీడియాకు తెలిపారు.

సెప్టెంబర్ 2న చంద్రయాన్-2 ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఉందన్నారు. ఆ రోజున లూనార్ ఆర్బిట్ నుంచి ల్యాండర్ వేరవుతుందని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 7న ల్యాండర్ చంద్రుడిపైకి చేరుతుందని శివన్ తెలిపారు.

చంద్రయాన్-2లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని ఆయన స్పష్టం చేశారు. సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నామని శివన్ ధీమా వ్యక్తం చేశారు. ల్యాండింగ్‌కు సంబంధించి ముందుగానే అన్ని పరీక్షలు నిర్వహించామని.. చంద్రయాన్-1లో ఉత్పన్నమైన సమస్యలు మరోసారి తలెత్తకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2